For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.8,500 డౌన్! రూ.48,000 దిగువకు... భారీగా తగ్గిన బంగారం ధరలు

|

ముంబై: దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. కరోనా కారణంగా బంగారం ధరలు ఈ ఏడాది ఆకాశాన్ని తాకాయి. ఆగస్ట్ నెలలో 40 శాతం వరకు ఎగిసిన ధరలు ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల వస్తుండటంతో పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072 డాలర్లకు ఎగబాకిన పసిడి ఇప్పుడు 1800 డాలర్ల దిగువకు వచ్చింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 నుండి రూ.48,000 దిగువకు వచ్చింది. గత నాలుగేళ్లలో ఓ నెలలో పసిడి ధరలు దారుణంగా క్షీణించడం ఇదే మొదటిసారి.

రూ.48,000 దిగువకు పసిడి

రూ.48,000 దిగువకు పసిడి

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.367.00 (0.76%) క్షీణించి రూ.47758.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,680.00 వద్ద ప్రారంభమై, రూ.47,922.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి రూ.48,000 దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8500 వరకు తగ్గింది.

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.319.00 (-0.66%) క్షీణించి రూ.47780.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,114.00 వద్ద ప్రారంభమై, రూ.48,114.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,551.00 కనిష్టాన్ని తాకింది.

రూ.58,000 స్థాయికి వెండి

రూ.58,000 స్థాయికి వెండి

వెండి ధర కూడా రూ.58వేలస్థాయికి వచ్చింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.434.00 (-0.74%) క్షీణించి రూ.58550.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.58,100.00 వద్ద ప్రారంభమై, రూ.58,649.00 వద్ద గరిష్టాన్ని, రూ.57,800.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.607.00 (-1.01%) తగ్గి రూ.59652.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,247.00 వద్ద ప్రారంభమై, రూ.59,834.00 గరిష్టాన్ని, రూ.58,880.00 కనిష్టాన్ని తాకింది.

నేడు గురు నానక్ జయంతి సందర్భంగా మార్కెట్లు క్లోజ్. దీంతో కమోడిటీ మార్కెట్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది.

అంతర్జాతీయ మార్కెట్లోను డౌన్

అంతర్జాతీయ మార్కెట్లోను డౌన్

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు క్షీణించాయి. ఔన్స్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 5.30 (-0.30%) డాలర్లు క్షీణించి 1,782.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,788.10 వద్ద ముగిసింది. 1,767.40 - 1,792.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 19 శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 0.139 (-0.61%) క్షీణించి 22.500 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 21.962 - 22.785 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 22.639 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 31 శాతం పెరిగింది.

English summary

రూ.8,500 డౌన్! రూ.48,000 దిగువకు... భారీగా తగ్గిన బంగారం ధరలు | Gold price slips below Rs 48,000, down 6 percent in November

Gold prices fell below Rs 48,000 per 10 gram in the Indian market tracking feeble global cues despite weakness in the US dollar. The Indian commodity market opened in the evening session as it was shut in the morning session on the eve of Guru Nanak Jayanti.
Story first published: Monday, November 30, 2020, 22:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X