బంగారం ధరలు నేడు(సెప్టెంబర్ 17, గురువారం) భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి సాయంత్రానికి రూ.400కు పైగా తగ్గి రూ.51,420 పలికింది. కిలో వెండి రూ.900 వరకు తగ్గి రూ.67,903 పలికింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరో మూడేళ్ల పాటు యథాతథంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గి ధరలు క్షీణించాయి. డాలర్ స్థిరంగా కొనసాగడం కూడా పసిడి ఇన్వెస్టర్ల నుండి డిమాండ్ తగ్గడానికి కారణమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పడుతుందని చెబుతూనే, నిరుద్యోగిత రేటు తగ్గిందని ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మిశ్రమంగా ఉన్నాయి. అయినప్పటికీ పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపలేదు.

మరింత తగ్గిన పసిడి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు మరో 1 శాతం తగ్గింది. స్పాట్ గోల్డ్ 0.9 శాతం మేర క్షీణించి ఔన్స్ ధర 1,940.96 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.2 శాతం పడిపోయి ఔన్స్ 1947.40 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు గత నెలలో 2072 డాలర్లకు పైన పలికింది. ఆ ధరతో పోలిస్తే ఇప్పటికీ 125 డాలర్ల వరకు తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు ఈ ఏడాది ఇప్పటి వరకు 28 శాతం మేర పెరిగాయి. ఇతరఅతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 1.6 శాతం మేర క్షీణించి ఔన్స్ 26.79 డాలర్లు, ప్లాటినమ్ 2.3 శాతం పడిపోయి 946.11 డాలర్లు, పల్లాడియం 1.3 శాతం తగ్గి 2,369 డాలర్లు పలికింది.

బులియన్ మార్కెట్లో ధర
హైదరాబాద్, విశాఖ, విజయవాడలో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.500కు పైగా తగ్గి రూ.53,950 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.50,000 దిగువకు వచ్చింది. వెండి కిలో రూ.69వేలకు దిగి వచ్చింది.

మద్దతు ధర
పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ మద్దతు ధర 1,955-1940, నిరోధకస్థాయి 19,78-1,988 వద్ద ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు మద్దతు ధర 10 గ్రాములు రూ.51,550 నుండి రూ.51,300, నిరోధక స్థాయి రూ.52,055 నుండి రూ.52,220 ఉంటుందని అంచనా. ఎంసీఎక్స్‌లో వెండి మద్దతు ధర కిలో రూ.68,300 నుండి రూ.67,800, నిరోధకస్థాయి రూ.69,200 నుండి రూ.69,800గా ఉండవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications