బంగారం ధర పెరిగేది కొండంత.. తగ్గేది గోరంత; నేడు కాస్త తగ్గిన పసిడి ధరలిలా!!
బంగారం ధర... ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బంగారం ధర ఇప్పటికే 62 వేల రూపాయల దగ్గరకు చేరుకుంది. ముందు ముందు 70 వేల రూపాయలకు బంగారం ధర చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు.
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలు, ఇప్పటిలో కట్టడికి వస్తాయి అన్న భావన ఏ ఒక్కరిలోనూ వ్యక్తం కావడం లేదు. గత రెండు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు, నేడు కాస్త తగ్గాయి. బంగారం ధర పెరిగితే కొండంత, తగ్గితే మాత్రం గోరంత అన్న చందంగా పరిస్థితి ఉంది. పెరిగితే ఒక్కసారిగా 500, 600 రూపాయలు పెరుగుతుండగా, తగ్గితే మాత్రం 100, 150 తగ్గుతుంది.

ఇక తాజాగా నేడు దేశీయంగా బంగారం ధర కాస్త తగ్గింది. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం మీద వంద రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం మీద 110 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. హైదరాబాద్లో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,200గా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,250గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,350 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,200గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
బెంగళూరులో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 56వేల 150 రూపాయలు ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,250గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,200గా విక్రయించబడుతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,100గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,200గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
దేశంలోనే ధరలు అధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, ఈరోడ్, తిరుపూరు, తిరుచ్చి, తిరునవ్వేలీలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 850 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.


Click it and Unblock the Notifications