దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గతవారం పెరిగిన పసిడి ధరలు రూ.52వేల మార్క్ దాటాయి. దీపావళి, ధనత్రయోదశికి ముందు బంగారంతో పాటు వెండి ధరలు కూడా షాకిచ్చాయి. అయితే కొనుగోలుదారులకు ఈ వారం ప్రారంభంలోనే (సోమవారం, నవంబర్ 9) భారీ గుడ్‌న్యూస్. పసిడి దాదాపు రూ.2500 తగ్గగా, వెండి దాదాపు రూ.4000 క్షీణించింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.6500 వరకు తక్కువగా ఉంది. వెండి కిలో రూ.18 వేల వరకు తగ్గింది.

రూ.2459 తగ్గిన పసిడి
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2,408.00 (-4.62%) తగ్గి రూ.49,759 వద్ద ట్రేడ్ అయింది. రూ.50వేల దిగువకు వచ్చింది. నేడు రూ.52,270.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.52,520.00 గరిష్టాన్ని, రూ.49,600.00 కనిష్టాన్ని తాకింది. సాయంత్రం గం.10 సమయానికి రూ.49,760 దిగువకు వచ్చింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.2,457.00 (-4.69%) క్షీణించి 10 గ్రాములు రూ.49,880.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.52,365.00 వద్ద ప్రారంభమై, రూ.52,648.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,746.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.3800 పతనం
వెండి ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.3,875.00 (-5.93%) క్షీణించి రూ.61,460.00 పలికింది. రూ.65,900.00 వద్ద ప్రారంభం కాగా, రూ.66,478.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,140.00 వద్ద కనిష్టాన్ని తాకింది.మార్చి ఫ్యూచర్స్ రూ.3,707.00 (-5.53%) తగ్గి కిలో రూ.63,374.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,670.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,258.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,057.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లు పతనం
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఔన్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 5.03 శాతం లేదా 98 డాలర్లకు పైగా క్షీణించి 1853 డాలర్లకు పడిపోయింది. ఒక్క సెషన్‌లోనే దాదాపు 100 డాలర్లు (మన రూపాయల్లో రూ.7000కు పైగా ) పడిపోయింది. 1,851.80 - 1,966.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది పసిడి ధర 30 శాతం మేర పెరిగింది. క్రితం సెషన్లో 1951 డాలర్ల వద్ద ముగిసింది.
వెండి ఫ్యూచర్స్ 6.86 శాతం తగ్గి 24 డాలర్ల దిగువకు వచ్చింది. 23.865 - 26.130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 25.662 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండ 51 శాతం పెరిగింది.

బంగారం అంతగా ఎందుకు తగ్గింది..
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే ఈ గండాన్ని గట్టెక్కుతాం. లేదంటే మొదటి దశ కరోనా వేవ్ కంటే రెండో దశలో ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాక్సిన్లు ఇప్పుడిప్పుడే మూడో దశ ప్రయోగాలను ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో ఏవి ఎంతమేర సత్ఫలితాలను ఇస్తాయన్న దానిపై కరోనాతో పోరాటం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఫార్మా కంపెనీ 'ఫైజర్' గుడ్ న్యూస్ చెప్పింది. తాము అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్.. తుది దశ ప్రయోగాల్లో 90శాతం కన్నా ఎక్కువ ప్రభావవంతమైన ఫలితాలనిచ్చిందని ఫైజర్ ఫార్మాసూటికల్స్ వెల్లడించింది. ఈ ప్రకటన నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఒత్తిడి తగ్గింది. ఫైజర్ నుండి ప్రకటన వచ్చిన కాసేపట్లోనే బంగారం ధర రూ.1000 ఆ తర్వాత రూ.2000కు పైగా తగ్గింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications