బంగారం ధరలు తగ్గుతున్నాయి.. ప్రీమియం కూడా తగ్గిపోతోంది
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం వారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5,600 వరకు తక్కువగా ఉంది. ఫిజికల్ గోల్డ్ డీలర్స్ వరుసగా రెండో వారం బంగారాన్ని ప్రీమియంలో విక్రయిస్తున్నారు. జ్యువెల్లరీ అమ్మకందారుల వద్ద ఇప్పటికే ఆభరణాలు నిల్వ ఉన్నాయి. దేశీయ బంగారం ధరలకు 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ ఉంటాయి. అంతకుముందు వారం ఔన్స్ పసిడిపై ప్రీమియం 2 డాలర్లు కాగా, గతవారం 1 డాలర్‌గా ఉంది.

అందుకే ప్రీమియం..
గత కొన్నాళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటుండటంతో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. పండుగ సీజన్ కాబట్టి అన్ని రంగాల్లోని వ్యాపారులతో పాటు బంగారం వ్యాపారులు కూడా ఆశలు పెట్టుకున్నారు. డీలర్ల నుండి డిమాండ్ నెమ్మదిగా మెరుగుపడుతోందని, సెప్టెంబర్ దిగుమతుల్లో గణనీయమైన తగ్గుదల డీలర్లు ప్రీమియం వసూలు చేయడానికి దోహదపడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ మాసంలో పసిడి దిగుమతులు 57 శాతం వరకు తగ్గిన విషయం తెలిసిందే.

ఒకశాతం మేర క్షీణించిన ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.50,552 వద్ద ముగిసింది. శుక్రవారం రూ.160 క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,600 వరకు తక్కువ ఉంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,615 వద్ద ముగిసింది. ఇది కూడా రూ.500 వరకు క్షీణించింది. శుక్రవారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.146 క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లోను పసిడి ధరలు గతవారం ఒక శాతం వరకు పడిపోయాయి.

ఈ ఏడాది 25 శాతం పెరుగుదల
బంగారం ధరలు ఈ క్యాలెండర్ ఏడాదిలో 25 శాతం వరకు పెరిగాయి. ఓ సమయంలో 30 శాతానికి పైగా పెరిగినప్పటికీ, ఆగస్ట్ రెండో వారం నుండి క్రమంగా తగ్గుదలను నమోదు చేశాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బంగారంపై ప్రతికూలంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications