Q3 2020 తర్వాత ఆ స్థాయికి మళ్లీ ఇప్పుడే, 2021 వరస్ట్ ఏడాది
బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. క్రితం సెషన్‌లో 1950 డాలర్లకు చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మాత్రం కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,584 వద్ద ఉంది. క్రితం సెషన్‌లో రూ.51,000 దిగువకు వచ్చినప్పటికీ నిన్న పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రూ.51,500 క్రాస్ అయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.241 తగ్గి రూ.51,925 వద్ద ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,000 వద్ద కదలాడుతోంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.287 క్షీణించి రూ.67,200 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.198 క్షీణించి రూ.67,994 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1950 డాలర్లను తాకినప్పటికీ, నేడు తగ్గింది. ఈ వార్త రాసే సమయానికి 12.20 డాలర్లు క్షీణించి 1937 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.163 డాలర్లు క్షీణించి 24.970 డాలర్ల వద్ద కదలాడింది.

2020 మూడో త్రైమాసికం తర్వాత పసిడి ధరలు 2022 మొదటి త్రైమాసికం (జనవరి - మార్చి) కాలంలో భారీగా లాభపడ్డాయి. కరోనా నేపథ్యంలో 2020 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లను తాకాయి. ఆ తర్వాత క్రమంగా క్షీణించాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తిరిగి 2060 డాలర్లను క్రాస్ చేసింది. అంటే ఏడాదిన్నర తర్వాత మళ్లీ బంగారం ఆ స్థాయిలో పుంజుకుంది. అదే సమయంలో 2021లో బంగారం భారీగా పడిపోయింది. కరోనా సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో 2021లో గరిష్టం నుండి క్రమంగా పడిపోయింది. దీంతో 2015 తర్వాత బంగారానికి అత్యంత వరస్ట్ ఏడాది 2021.


Click it and Unblock the Notifications