Gold prices today: నిన్న రూ.500 పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఊగిసలాటలో ఉన్నాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,500కు పైన ముగిశాయి. నేడు హోలీ పర్వదినం సందర్భంగా స్టాక్, బులియన్ మార్కెట్‌కు సెలవు. అయితే క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500 వరకు పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.493 పెరిగి రూ.51,640 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.507 ఎగిసి రూ.52,070 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.1215 పెరిగి రూ.68,519 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1247 పెరిగి రూ.69,363 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1940 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో కాస్త పెరిగి 1943 వద్ద ముగిసింది. నేడు స్వల్పంగా క్షీణతను నమోదు చేసింది. ఏడాదిలో పసిడి దాదాపు పన్నెండు శాతం లాభపడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.440 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 25.616 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 2.16 శాతం క్షీణించింది.

గోల్డ్ ఫ్యూచర్స్ దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 కాగా, కామెక్స్‌లో 2075 డాలర్లు. గతవారం ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు రూ.55,500 దరికి చేరుకోగా, కామెక్స్‌లో 2070 డాలర్లను సమీపించాయి. అంటే పసిడి ధరలు ఏడాదిన్నర గరిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఇప్పుడు రూ.53,000 దిగువన ఉన్నాయి.


Click it and Unblock the Notifications