బంగారం, వెండి ధరలు వారంలో ఎంత పెరిగాయంటే, మార్కెట్లో ఎంత ధర ఉందంటే?
బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే మార్పులు, డాలర్ వ్యాల్యూ, కరోనా వంటి తాత్కాలిక పరిస్థితులు, ట్రేడ్ వార్, ఈక్విటీ మార్కెట్లు వంటి వివిధ కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. సోమవారం నుండి శనివారం వరకు బంగారం మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆధివారం ట్రేడింగ్ ఉండదు. శనివారం నాటి సాయంత్రం ధరకే కొద్ది మార్పులతో ఉంటాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం వరకు భారీగా పెరిగిన ధరలు ఆ తర్వాత భారీగా తగ్గాయి. గత వారం మాత్రం పెరుగుదలను నమోదు చేశాయి.

పెరుగుతున్న ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో గత 4 సెషన్లుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీని ఆధారంగా పసిడి ధరలు ఈసారి ఔన్స్ 1,889 డాలర్ల నుండి 1,917 డాలర్ల మధ్య తచ్చాడవచ్చునని అంచనా వేస్తున్నారు. చివరి సెషన్‌లో పసిడి ధర ఔన్స్ 1,895 నుండి 1,923 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. చివరకు 1,916 వద్ద సెటిల్ అయింది. అయితే ఈ వారం అంతగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని భావిస్తున్నారు. గత వారంలో ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి.

గతవారం రూ.800 పెరుగుదల
సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం 10 గ్రాముల పసిడి రూ.100కు పైగా తగ్గింది. మంగళవారం దాదాపు రూ.500 పెరిగింది. బుధవారం మరో రూ.200 పెరిగిన ధర మరుసటి రోజు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం అంతేస్థాయిలో పెరిగాయి. గత వారం దాదాపు రూ.800కు పైగా పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల పసిడి సోమవారం రూ.52,150 వద్ద ప్రారంభమైంది. శనివారంరూ.42,900 వద్ద ముగిసింది. ధర రూ.750కి పైగా పెరిగింది.

పెరిగిన వెండి ధరలు
పండుగ సీజన్ ప్రారంభమైతే ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా గత వారం ధరలు పెరగడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.గతవారం వెండి ధరలు కూడా పెరిగాయి. సోమవారం కిలో రూ.61,200 వద్ద ప్రారంభమైంది. ఒక్కో సెషన్‌లో రూ.500 నుండి రూ.2,700 వరకు పెరిగాయి. సోమవారం రూ.1,000, గురువారం రూ.300 వరకు క్షీణించింది. మొత్తంగా గత వారం వెండి మూడువేల రూపాయలకు పైగా పెరిగింది.


Click it and Unblock the Notifications