2020 సంవత్సరంలో బంగారం ధరలు 25 శాతం మేర రిటర్న్స్ ఇచ్చాయి. మార్చి నుండి ఆగస్ట్ మొదటి వారం మధ్య అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కాస్త తగ్గాయి. ఇటీవల అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో 1900 డాలర్ల దిగువన, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.50,000 వద్ద కదలాడుతోంది. కరోనాకు తోడు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. అయితే ఈ సంవత్సరం (2021) అంత గత ఏడాదిలా పసిడి రిటర్న్స్ అందించే అవకాశాలు తక్కువ అంటున్నారు.

అలాగే ఉండే అవకాశం
గత ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1461 వద్ద ప్రారంభం కాగా ఓ సమయంలో 2072ని తాకింది. ఏడాది చివరలో 1900 డాలర్లకు సమీపంలో క్లోజ్ అయింది. మొత్తంగా 25 శాతం నుండి 28 శాతం వరకు పసిడి రిటర్న్స్ ఇచ్చింది. ఈ వారం కూడా పసిడి ధరలు దాదాపు అదే స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

అంత భారీ రిటర్న్స్ లేకపోయినా.. పెట్టుబడులు
2021లో కరోనా పరిస్థితులు దారుణంగా ఉంటే తప్ప 2020లో వచ్చిన భారీ రిటర్న్స్ రాకపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఫెడ్ రిజర్వ్ సుదీర్ఘ కాలం వడ్డీ రేటును జీరోగా ఉంచడం, వివిధ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో మాత్రం బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అక్కడ అంతే
గతవారం దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి రూ.50,235 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 0.02 శాతం ఎగిసి రూ.68,120 వద్ద క్లోజ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.01 శాతం పెరిగి 1901.60 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.01 శాతం తగ్గి 26.525 డాలర్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications