కరోనా మహమ్మారి కారణంగా కొద్దినెలలుగా పెరుగుతున్న పసిడి ధరలు రెండు వారాలుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వివిధ ఆర్థిక వ్యవస్థల సానుకూలత, కరోనా కేసులు తగ్గుతుండటం, వ్యాక్సీన్ ఆశలు సహా వివిధ అంశాల కారణంగా పసిడి ధర ఈ వారం కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, కరోనా కేసులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

రూ.50,000 దిగువకు వచ్చే అవకాశాలు
గోల్డ్ అక్టోబర్ కాంట్రాక్ట్ ఈ వారం మరింతగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకులు ఏం చెబుతాయనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుందని, అప్పుడు ఊగిసలాట కూడా కనిపించవచ్చునని అంటున్నారు. పసిడి రూ.51,100 కంటే దిగువకు వస్తే మరింత బలహీనపడి రూ.50 వేల లోపుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే రూ.48వేల దిగువకు కూడా చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1800 డాలర్ల దిశగా!
సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ కిలో రూ.70,500 కంటే పైకి ట్రేడ్ అయితే ఆ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని, కానీ ప్రస్తుతం ఉన్న ధర కంటే మరింతగా బలహీనపడితే మాత్రం క్షీణించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు.
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లోను క్షీణించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఔన్స్ ధర 1900 డాలర్ల కంటే పడిపోతే 1800 డాలర్ల దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మార్కెట్ జూమ్
ఈ వారం స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్, ఆర్బీఐ నుండి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు పెరగడానికి దోహదపడతాయి. డిమాండ్ పెరుగుతున్న్ నేపథ్యంలో చమురు ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. FPIలు షేర్లను కొనుగోలు చేస్తుండగా, DIIలు షేర్లను విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications