Gold price for today: రూ.51,800 దిగువన ముగిసిన పసిడి
బంగారం ధరలు గతవారం దాదాపు స్థిరంగా ముగిశాయి. అంతకుముందు వారం రూ.53,000కు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000 దిగువకు పడిపోయాయి. గతవారం రూ.51,000 దిగువకు చేరుకున్నప్పటికీ చివరలో మళ్లీ ఎగిసిపడ్డాయి. చివరి సెషన్‌లో అయితే ఏకంగా రూ.500 వరకు లాభపడి రూ.51,750 పైన ముగిశాయి. వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి. గతవారం ఆరంభంలో రూ.65,000కు పైన ప్రారంభమైన సిల్వర్ ఫ్యూచర్స్ వారాంతానికి రూ.63,500కు పడిపోయాయి.
ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.51,760 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,961 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.412.00 తగ్గి రూ.63,505 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.229 తగ్గి రూ.64,351 వద్ద ముగిసింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.4500 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం 1900 డాలర్లకు పైన పలికినప్పటికీ, మధ్యలో ఈ స్థాయి దిగువకు వచ్చింది. చివరలో మళ్లీ ఈ మార్కు పైకి చేరుకున్నప్పటికీ, మళ్లీ క్షీణించింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.60 డాలర్లు లాభపడి 1897 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.396 డాలర్లు తగ్గి 22.785 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications