Gold price today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు నేడు (సోమవారం 13 డిసెంబర్) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21 పెరిగి రూ.48,185 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.69 పెరిగి రూ.48,360 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 డాలర్లు లాభపడి 1784.95 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 0.047 డాలర్లు పెరిగి 22.142 డాలర్లకు చేరుకుంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.193 పెరిగి రూ.61,344 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.208 పెరిగి రూ.61,950 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.047 డాలర్లు లాభపడి 22.242 డాలర్లకు చేరుకుంది.

ఒమిక్రాన్ ప్రభావం అంతంతే
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీస్ ధరలు మిక్స్డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అని తెలియడంతో ఓ వైపు చమురు ధరలు, మరోవైపు పసిడి ధరలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం ఆర్థిక రికవరీ పైన స్వల్ప ప్రభావమే చూపుతుందనే వార్తల నేపథ్యంలో చమురు డిమాండ్ పుంజుకుంది. ఇక బంగారం గత వారం 1783 డాలర్ల వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.14 శాతం పెరిగింది. పసిడి ఫ్యూచర్ ఈ వారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8000 తక్కువ
గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం రూ.48,185 వద్ద ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టంతో 300 డాలర్ల వరకు తక్కువగా ఉంది. బలమైన డాలర్, ఒమిక్రాన్ తక్కువ ప్రభావం వంటి అంశాలు ఈ వారం పసిడి దాదాపు స్థిరంగా ఉండేందుకు కారణంగా చెబుతున్నారు.

గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్
గోల్డ్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఈ వారం రూ.47,800 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే సానుకూల ధోరణిలో చలించేందుకు అవకాశముంది. ప్రపంచవ్యాప్త పరిణామాలు, ఫెడ్ సమావేశ ముఖ్యాంశాల ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన ఉంటుంది. సిల్వర్ ఫ్యూచర్ రూ.62,000 పైన కదలాడితే రూ.62,500 దిశగా, ఆ తర్వాత రూ.62,900కు పెరిగే అవకాశముంది.


Click it and Unblock the Notifications