హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం వాటి ధరల్లో మరింత క్షీణత కనిపించింది. సాధారణంగా వీకెండ్‌లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం కూడా అదే సంప్రదాయం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో శుక్రవారం నాటి బంగారం ధరల ట్రేడింగ్‌కు అనుగుణంగా ఇవ్వాళ కూడా తగ్గుదల చోటు చేసుకుంది.

52 వేలు దాటినా..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 10 గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉండేది. యుద్ధం ఆరంభమైన తరువాత ఈ ధర 51,000 రూపాయలను దాటేసింది. ఆ తరువాతి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఒక దశలో గరిష్ఠానికి చేరుకుంది. 52,797 రూపాయలకు చేరుకుంది. మరింత పైపైకి చేరుకుంటాయంటూ అంచనాలు వెలువడినప్పటికీ- ఉన్నట్టుండి పసిడి ధరలు పడిపోయాయి. వెండిది కూడా అదే పరిస్థితి. వెండి ధర కేజీ ఒక్కింటికి 1,500 వరకు పెరిగి రూ.66,000 రూపాయలను దాటుకున్నా.. మళ్లీ తగ్గాయి.

పసిడి పరుగులో..
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లోనూ బంగారం ధరల్లో క్షీణత నెలకొంది. గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 578 రూపాయల మేర తగ్గింది. 50,965 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. సిల్వర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ఒక్కింటికి 1,179 రూపాయల మేర పడిపోయింది. 64,852 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి రేటులో పతనం కనిపించింది. గోల్డ్ ఫ్యూచర్స్ 10.85 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 0.87 డాలర్లు తగ్గింది.

మరింత తగ్గుదల..
యుద్ధం ఆరంభమైన మూడో రోజు కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,570 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 46,350 రూపాయలుగా నమోదైంది. బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1,870 రూపాయల మేర తగ్గింది. దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు 24 క్యారెట్లు 51,110 రూపాయలు, 22 క్యారెట్లు 47,260 రూపాయలుగా పలికింది.

వేర్వేరు నగరాల్లో.. వేర్వేరు ధరలు
అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 46,950 రూపాయలు, 24 క్యారెట్లు 50,950 రూపాయలుగా రికార్డయింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 46,850 రూపాయలు, 24 క్యారెట్లు 51,110, రూపాయలు, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 48,010 రూపాయలు, 24 క్యారెట్లు 52,370 రూపాయలుగా నమోదైంది. కోయంబత్తూర్‌లో 22 క్యారెట్ల బంగారం 48,010 రూపాయలు, 24 క్యారెట్లు 52,370 రూపాయలకు చేరింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications