Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, రూ.51,000 దిగువకు...
బంగారం ధరలు తగ్గుతున్నాయి. క్రితం సెషన్‌లో ఏకంగా 51,000 స్థాయికి దిగి వచ్చాయి. నేడు ఐతే ఈ స్థాయి కిందకు పడిపోయాయి. కొద్ది రోజుల క్రితం బంగారం రూ.53,000 వద్ద కదలాడింది. అయితే వారం పది రోజుల్లోనే బంగారం రూ.2000కు పైగా తగ్గింది. ఈ రోజు (ఏప్రిల్ 28) ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.243 తగ్గి రూ.50,956 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.235 లాభపడి రూ.51,207 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5300 తక్కువగా ఉంది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65 తగ్గి రూ.64,615 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.37 పెరిగి రూ.65,327 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000కు పైన ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.15000 తక్కువగా ఉంది. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 నుండి రూ.73,000 స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ కాలంలోనే రూ.65,000 దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1875 డాలర్ల స్థాయికి వచ్చాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 11 డాలర్లకు పైగా తగ్గి 1877 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.330 డాలర్లు తగ్గి 23.130 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1888 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 5.25 శాతం పెరిగింది. పసిడి ధరలు రెండు నెలల కనిష్టానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications