బంగారం ధరలు నేడు (బుధవారం, జూన్ 2) పెరిగాయి. వెండి ధరలు ఉదయం రూ.250 వరకు క్షీణించినప్పటికీ, సాయంత్రానికి అంతేస్థాయిలో పెరిగాయి. మొత్తంగా నేడు కనిష్ట స్థాయి నుండి రూ.700కు పైగా పెరిగింది. బంగారం మాత్రం రూ.49వేల పైనే కదలాడింది. ఈ స్థాయికి కిందకు కనీసం కూడా రాలేదు. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం రూ.7000కు పైగా తక్కువగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ 1900 డాలర్ల పైకి చేరుకున్నాయి.

పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.136.00 (0.28%) పెరిగి రూ.49131.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,100.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,200.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,075.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.113.00 (0.23%) పెరిగి రూ.49538.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,311.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,667.00 గరిష్టాన్ని, రూ.49,301.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72,500 పైన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.255.00 (0.35%) పెరిగి రూ.72503.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,000.00 వద్ద ప్రారంభమై, రూ.72,510.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,698.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.251.00 (0.34%) తగ్గి రూ.73664.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,160.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,664.00 గరిష్టాన్ని, రూ.72,908.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 1900 డాలర్ల పైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.15
(+0.17%) డాలర్లు పెరిగి 1,908.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,896.75 - 1,911.65 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.101 (+0.36%) డాలర్లు పెరిగి 28.203 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.780 - 28.212 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications