నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు(జూన్ 18, శుక్రవారం) ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం సాయంత్రానికి కాస్త క్షీణించింది. ఉదయం రూ.1100కు పైగా పెరిగిన వెండి ధరలు ఆ తర్వాత రూ.300 పెరుగుదలతో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1775 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దిగువకు పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో గోల్డ్ ధర రూ.9300 తక్కువగా ఉంది. బంగారం ఓ సమయంలో రూ.46,700 దిగువకు పడిపోయింది. నిన్న పసిడి రూ.1600కు పైగా క్షీణించింది.

తగ్గిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.28.00 (0.06%) క్షీణించి రూ.46930.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,147.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,387.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,680.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64.00 (0.14%) తగ్గి రూ.47212.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,415.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,566.00 గరిష్టాన్ని, రూ.46,990.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.330 పెరుగుదల
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.337.00 (0.50%) పెరిగి రూ.67936.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,417.00 వద్ద ప్రారంభమై, రూ.68,740.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,505.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.399.00 (0.58%) పెరిగి రూ.69025.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,324.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,770.00 గరిష్టాన్ని, రూ.68,532.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగాయి. కామెక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.05 (0.00%) డాలర్లు పెరిగి 1,774.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,768.85 - 1,797.50 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.191 (0.74%) డాలర్లు పెరిగి 26.047 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.902 - 26.552 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications