Gold price discount: బంగారం ధరల్లో డిస్కౌంట్ ఎనిమిది నెలల గరిష్టానికి
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్, షట్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో దుకాణాలు బంద్ ఉన్నాయి. బంగారం దుకాణదారులు ఈ వారం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఔన్స్ పసిడి పైన 10 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 2020 నుండి ఈ డిస్కౌంట్ ఇదే మొదటిసారి. భారత్‌లో బంగారం ధరలపై 10.75 శాతం దిగుమతి, 3 శాతం జీఎస్టీ ఉంటుంది. వచ్చే (జూన్) నెల నుండి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు బంగారం డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నారు.

బంగారం ధరలు ఇలా
బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో నేడు (ఆదివారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల పసిడి రూ.46,580, 24 క్యారెట్ల పది గ్రాములు బంగారం రూ.47,580గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,590 , 24 క్యారెట్ల పసిడి రూ.47,590 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.46,120, 24 క్యారెట్ల పసిడి రూ.50,310గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.45,810, 24 క్యారెట్ల పసిడి రూ.49,960గా ఉంది.

గతవారం ఇలా క్లోజ్
గత వారం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం రూ.48,600 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,155 వద్ద క్లోజ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.71530.00 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.158.00 ఎగిసి రూ.72690.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల పైన ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1905.30 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 28.060 డాలర్ల వద్ద ముగిసింది.

వెండి హైజంప్
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.7800 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8 వేలకు పైగా తక్కువగా ఉంది. పసిడి ధరలు చాన్నాళ్లకు రూ.50.000 సమీపానికి చేరుకున్నాయి. అలాగే వెండి రూ.70వేలు క్రాస్ చేసింది. బంగారం కంటే వెండి గత కొద్ది రోజులుగా వేగంగా పెరుగుతోంది.


Click it and Unblock the Notifications