For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెడ్ మీటింగ్ ఎఫెక్ట్, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

|

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. రూ.48,000 క్రాస్ చేసి, రూ.48,500 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ చల్లబడింది. నిన్న స్వల్పంగా తగ్గి, నేడు దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నేడు (డిసెంబర్ 15) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52.00 (-0.11%) క్షీణించి రూ.48020.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.19.00 (-0.04%) తగ్గి రూ.48185.00 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.128.00 (-0.21%) క్షీణించి రూ.60690.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.139.00 (-0.23%) తగ్గి రూ.61303.00 వద్ద ట్రేడ్ అయింది.

క్షీణించిన ధరలు

క్షీణించిన ధరలు

బంగారం ధరలు క్రితం సెషన్‌లో క్షీణించాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.223 తగ్గి రూ.48,080 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.742 తగ్గి రూ.60,840 వద్ద ముగిసింది.

ఇక, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 2.25

(-0.13%) డాలర్లు క్షీణించి 1,770.05 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.057

(-0.26%) డాలర్లు తగ్గి 21.867 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1,772.30 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 21.924 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో బంగారం 4 శాతం, వెండి 9 శాతం క్షీణించింది.

ఫెడ్ మీటింగ్

ఫెడ్ మీటింగ్

నేడు ఫెడ్ మీటింగ్ ఉంది. దీంతో మొన్నటి వరకు గోల్డ్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే వడ్డీ రేట్లు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నప్పటికీ, త్వరలోనే పెంచవచ్చుననే అంచనాల నేపథ్యంలో రెండు రోజులుగా గోల్డ్ ఇన్వెస్టర్లు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో నిన్న పసిడి స్వల్పంగా తగ్గింది. నేడు కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది.

మద్దతుస్థాయి, నిరోధకం

మద్దతుస్థాయి, నిరోధకం

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం మద్దతు ధర రూ.47,920-47,780. నిరోధకస్థాయి రూ.48,220-48,380. సిల్వర్ మద్దతు ధర రూ.60,300-60,000. నిరోధకస్థాయి రూ.61,200-61,600.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1758-1750 డాలర్లు. నిరోధకస్థాయి 1784-1800 డాలర్లు. వెండి మద్దతు ధర 21.70-21.44. నిరోధకస్థాయి 22.20-22.55 డాలర్లు.

English summary

ఫెడ్ మీటింగ్ ఎఫెక్ట్, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? | Gold price dips ahead of Fed meeting today

Gold price today at MCX (Multi Commodity Exchange) dipped for second consecutive day and came close to ₹48,000 per 10 gm mark. According to commodity market experts, this dip in gold price is due to the Fed meeting today.
Story first published: Wednesday, December 15, 2021, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X