రూ.48,000 సమీపంలోనే ముగిసిన బంగారం ధరలు, అక్కడ భారీగా డౌన్ కానీ
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు చివరి సెషన్‌లో క్షీణించాయి. గతవారం రూ.48,000 స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో కాస్త తగ్గి రూ.47,895 వద్ద ముగిసింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.21.00 (-0.04%) క్షీణించి రూ.47895.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.28.00 (-0.06%) తగ్గి రూ.48051.00 వద్ద ముగిసింది. అదే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.683.00 (1.09%) పెరిగి రూ.63570.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.719.00 (1.13%) ఎగిసి రూ.64079.00 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 29.70
(-1.65%) డాలర్లు క్షీణించి 1,768.20 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.125
(-0.53%) డాలర్లు పడిపోయి 23.352 డాలర్ల వద్ద ముగిసింది. గతవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ వారం మొత్తంలో పెరిగాయి. అయితే వారం మిడిల్‌లో ఓ సమయంలో 1800 డాలర్ల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో మాత్రం 30 డాలర్ల మేర క్షీణించడంతో 1770 డాలర్ల దిగువన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్లకు పైన ముగిసింది.

కామెక్స్‌లో అంతకుక్రితం సెషన్‌లో బంగారం ఫ్యూచర్ 1,797.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. కానీ వారాంతానికి 1770 డాలర్ల దిగువకు వచ్చింది. నిన్నటి సెషన్‌లో గోల్డ్ 1,765.20 - 1,797.65 డాలర్ల మధ్య కదలాడింది. గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు కాగా, కనిష్టం 1677.90 డాలర్లు. సిల్వర్ 52 వారాల గరిష్టం 29.930 డాలర్లు కాగా, కనిష్టం 21.410 డాలర్లు.


Click it and Unblock the Notifications