Gold price today: గతవారం రూ.4000 తగ్గిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు గతవారం క్షీణించాయి. అంతకుముందు వారం గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.55,000 క్రాస్ చేశాయి. గతవారం రూ.51,500 దిగువకు వచ్చాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.172 క్షీణించి రూ.51,475 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.236 తగ్గి రూ.51,830 వద్ద ముగిసింది. రూ.55,500 స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,500 దిగువకు వచ్చింది. అంటే దాదాపు రూ.4000 క్షీణించింది.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,000 దిగువకు వచ్చింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.496 తగ్గి రూ.67,950 వద్ద, జూలై గోల్డ్ ఫ్యూచర్స్ రూ.511 క్షీణించి రూ.68,757 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.72వేలు దాటినప్పటికీ, ఇప్పుడు రూ.68,000 దిగువకు వచ్చింది. గోల్డ్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 కాగా, ఈ ధరతో ప్రస్తుతం రూ.4400 తక్కువగా ఉంది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1921 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.130 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1943 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 1,918.25 - 1,946.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24.983 - 25.642 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications