For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: అక్షయ తృతీయకు ముందు 'బంగారం'లాంటి వార్త

|

అక్షయ తృతీయ సమయంలో బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట. గత మూడు నాలుగు సెషన్లుగా క్షీణిస్తున్న పసిడి దరలు నిన్నటి సెషన్లోను స్వల్పంగా తగ్గాయి. నేడు రంజాన్ సందర్భంగా మార్కెట్లు కోల్జ్. రేపు అంటే మే 14వ తేదీన అక్షయ తృతీయ. ఓ వైపు కరోనా కేసులు పెరగడం, మరోవైపు మార్కెట్లు నష్టాల్లో ఉన్న నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఇటీవల పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. అయినప్పటికీ రూ.47,000 పైనే ఉంది. వెండి ధరలు రూ.71,000 పైన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల 1850 డాలర్ల సమీపానికి చేరుకున్న పసిడి నేడు 1820 డాలర్ల దిగువన ఉంది.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ముగింపు సెషన్లో రూ.161.00 (-0.34%) తగ్గి రూ.47472.00 వద్ద క్లోజ్ అయింది. రూ.47,497.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,862.00 గరిష్టాన్ని, రూ.47,374.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.196.00 (-0.41%) తగ్గి రూ.47971.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,015.00 వద్ద ప్రారంభమై, రూ.48,359.00 గరిష్టాన్ని, రూ.47,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,000 సమీపానికి వెండి

రూ.71,000 సమీపానికి వెండి

వెండి ఫ్యూచర్ ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రాత్రి సెషన్లో రూ.809.00 (-1.12%) తగ్గి రూ.71120.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,805.00 వద్ద ప్రారంభమై, రూ.72,224.00 గరిష్టాన్ని, రూ.70,956.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.671.00 (-0.92%) తగ్గి రూ.72263.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,517.00 ప్రారంభమైన ధర, రూ.73,250.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,105.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గింది. 1820 డాలర్ల దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు -5.35

(0.29%) డాలర్లు తగ్గి 1,817.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,813.50 - 1,822.65 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. 0.122 (0.45%) డాలర్లు తగ్గి 27.122 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.062 - 27.330 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold price today: అక్షయ తృతీయకు ముందు 'బంగారం'లాంటి వార్త | Gold price dip opportunity for Akshaya Tritiya buyers

Akshaya Tritiya 2021 is falling tomorrow i.e. 14th May 2021. In India, this is an auspicious day to buy gold (both physical and electronic). So, for those yellow metal buyers who are planning to accumulate further on Akshaya Tritiya, there is a piece of good news for them as the gold price at Multi Commodity Exchange (MCX) dipped ₹161 after making Wednesday close of ₹47,472 per 10 gm.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X