రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు నేడు క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు ఈ వారం తగ్గిన విషయం తెలిసిందే. దీంతో నేడు రిటైల్ మార్కెట్లోను ధరలు పడిపోయాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.44,250, 24 క్యారెట్ల పసిడి రూ.48,290 పలికింది. 24 క్యారెట్ల పసిడి చెన్నైలో రూ.48,720, ముంబైలో రూ.47,440, ఢిల్లీలో రూ.50,620. కోల్‌కతాలో రూ.49,830, బెంగళూరులో రూ.48,290, పుణేలో రూ.47,440 పలికింది.

రూ.9000 వరకు డౌన్
ఎంసీఎక్స్‌లో బంగారం నిన్న రూ.47,500 దిగువన ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.163.00 (-0.34%) తగ్గి రూ.47,345.00 వద్ద ముగిసింది. రూ.47,411.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,586.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,111.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.192.00 (0.40%) తగ్గి రూ.47,476 వద్ద క్లోజ్ అయింది. రూ.47,635.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,725.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల దిగువ సిల్వర్ క్లోజ్
వెండి ధరలు నిన్న స్వల్పంగా పెరిగినప్పటికీ, రూ.70వేలకు దిగువనే క్లోజ్ అయ్యాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.692.00 (1.01%) పెరిగి రూ.69,184.00 వద్ద ముగిసింది. రూ.68,506.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,330.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.511.00 (0.73%) పెరిగి రూ.70,202.00 వద్ద ముగిసింది. రూ.69,646.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,593.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్ ఎంతంటే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గాయి. నిన్న ఔన్స్ 1825 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.25 (-0.12%) డాలర్లు తగ్గి 1824.55 డాలర్ల వద్ద ముగిసింది. ఈ సెషన్లో 1,810.25 - 1,831.35 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.06 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. ఔన్స్ ధర 0.388 (1.43%) డాలర్లు పెరిగి 27.435 డాలర్ల వద్ద ట్రేడ్ ముగిసింది. నేటి సెషన్లో 26.913 - 27.500 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 54.47 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications