నేడు (జూన్ 9, బుధవారం) బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉండగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్భణం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. ఈ వారంలో పెరుగుదల కనిపించినప్పటికీ 1912 నుండి 1918 డాలర్ల మధ్య నిరోదకస్థాయి ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో 10 గ్రాముల పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7100 తక్కువగా ఉంది.

స్థిరంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.20.00 (0.04%) తగ్గి రూ.49107.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,150.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,269.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,024.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.5.00 (-0.01%) తగ్గి రూ.49410.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,473.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,540.00 గరిష్టాన్ని, రూ.49,340.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.642.00 (0.90%) పెరిగి రూ.71873.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,356.00 వద్ద ప్రారంభమై, రూ.72,150.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,056.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.536.00 (0.74%) తగ్గి రూ.72967.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,560.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,289.00 గరిష్టాన్ని, రూ.72,253.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 1895 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.45 (0.02%) డాలర్లు తగ్గి 1,893.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,889.35 - 1,901.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. 0.266 (0.96%) డాలర్లు తగ్గి 27.997 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.625 - 28.142 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications