Gold Price today: రూ.50,000 దాటిన బంగారం ధర, వెండి రూ.65,000 దిశగా
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేటి (ఫిబ్రవరి 15, మంగళ వారం) ప్రారంభ సెషన్‌లో రూ.50,000 దాటి కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చాయి. క్రితం సెషన్‌లో రూ.50,000 సమీపానికి వచ్చిన బంగారం ధర నేడు దాదాపు మరో రూ.300 పెరిగి రూ.50,200 సమీపానికి చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు వంటి పరిస్థితులు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు ద్రవ్యోల్భణ ఆందోళనలు కూడా బులియన్ మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఈ వారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు మూడు నెలల గరిష్టాన్ని తాకాయి.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్ ధర నేడు రూ.281 (0.56 శాతం) పెరిగి రూ.50,197 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.288 (0.58 శాతం) పెరిగి రూ.50,365 వద్ద ట్రేడ్ అయింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.270 (0.42 శాతం) పెరిగి రూ.64,503 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.270 (0.42 శాతం) ఎగిసి రూ.64,503 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లోనే రూ.64,000 క్రాస్ చేసింది. ఇప్పుడు రూ.64,600 దాటి, రూ.65,000 దిశగా సాగుతోంది.

వెండి ధర జంప్
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర 1900 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. క్రితం సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 7 శాతానికి పైగా పెరిగి 1878.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో వెండి ధరలు కూడా ఎగిసిపడ్డాయి. ఔన్స్ సిల్వర్ 24 డాలర్లను సమీపించింది. క్రితం సెషన్‌లో 0.8 శాతం పెరిగి 23.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారంపై డాలర్ ప్రభావం
ఎప్పుడైతే అమెరికా డాలర్ బలపడుతుందో, అప్పుడు బంగారం ధరలు కాస్త తగ్గుతాయి. అమెరికా డాలర్ బలపడితే USDతో అనుబంధం ఉన్న ఉత్పత్తి కొనుగోలుకు తక్కువ డాలర్ల అవసరం ఏర్పడుతుంది. అదే సమయంలో డాలర్ బలహీనపడితే ఎక్కువ USD డాలర్లు అవసరం పడతాయి. బంగారం వంటివి అమెరికా డాలర్ వ్యాల్యూతో లెక్కిస్తారు. బంగారం ధరపైన డాలర్ హెచ్చుతగ్గుదల ప్రభావం కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications