For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: తగ్గుతున్న బంగారం ధరలు, డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది

|

బంగారం ధరలు గతవారం దాదాపు స్థిరంగా ముగిశాయి. అంతకుముందు వారం రూ.51,700 పైన ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000కు కాస్త అటుఇటుగానే కదలాడి, చివరకు 51,300 పైన ముగిశాయి. అంతకుముందు రూ.51,000 దిగువకు వచ్చినప్పటికీ క్రితం సెషన్‌లో రూ.450 వరకు పెరగడంతో మళ్లీ రూ.51,300 దాటింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రూ.63,000కు దిగువనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1890 డాలర్లకు దిగువన, సిల్వర్ ఫ్యూచర్స్ 22.500 డాలర్లకు దిగువన ముగిశాయి.

ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.445 పెరిగి రూ.51,344 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.441 పెరిగి రూ.51,590 వద్ద ట్రేడ్ ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.184 పెరిగి రూ.62,520 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.252 ఎగిసి రూ.63,295 వద్ద ముగిసింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ప్రస్తుతం రూ.5000 వరకు తక్కువగా ఉంది.

Gold price continues to dip as dollar sustains at record high

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 7.10 డాలర్లు పెరిగి 1882.80 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.071 డాలర్లు ఎగిసి 22.372 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 200 డాలర్లు తక్కువగా ఉంది. మొత్తానికి ఈవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. పసిడి ధరలు వరుసగా మూడో వారం క్షీణించాయి. ఓ వైపు డాలర్ వ్యాల్యూ పెరుగుతుంటే పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

English summary

Gold prices today: తగ్గుతున్న బంగారం ధరలు, డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది | Gold price continues to dip as dollar sustains at record high

Gold prices slid for the third week in a row but managed to witness a respite in the latter part of the week.
Story first published: Saturday, May 7, 2022, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X