బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 28) మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో తగ్గుముఖం పట్టాయి. ఉదయం గం.9.05 సమయానికి గోల్డ్ జూన్ ఫ్యూచర్ డెలివరీ 10 గ్రాములు 0.74 శాతం తగ్గి రూ.45,850 పలికింది. అంతకుముందు రూ.46,191 వద్ద క్లోజ్ అయింది. ఉదయం రూ.46,000 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు పడిపోయాయి. అయినప్పటికీ ఔన్స్ ధర 1,700 డాలర్లుగా ఉంది. స్పాట్ గోల్డ్ 0.7 శాతం తగ్గి 1,702.09 డాలర్లు, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,719.20 డాలర్లు పలికింది.
ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.46,000 దిగువకు వచ్చింది. నిన్నటి కంటే దాదాపు రూ.400 తగ్గింది. ఇక కిలో వెండి రూ.450 వరకు తగ్గింది. వెండి ధర కిలో 0.91 శాతం తగ్గి రూ.41,575 పలికింది. వెండి ధర రూ.41,565 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూ.41,957 వద్ద క్లోజ్ అయింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో పల్లాడియం 0.6 శాతం పెరిగి 1,937.16 డాలర్లకు, ప్లాటినమ్ 758.08 డాలర్లకు, వెండి 15.03 డాలర్లు పలికింది.

బంగారం ధరలు ఈ దీపావళి నాటికి రూ.50,000 చేరుకుంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మరో 7.5 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.82,000 చేరుకుంటుందని కూడా బోఫా అంచనా వేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications