బంగారం ధరలు మంగళవారం (ఆగస్ట్ 18) పెరిగాయి. వరుసగా రెండు రోజుల్లో రూ.1500 వరకు పెరిగింది. ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 1 శాతం పెరిగి రూ.53,800 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 2 శాతం పెరిగి రూ.70,554 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి దాదాపు 2 శాతం పెరిగింది. వెండి 2.6 శాతం పెరిగింది. ఆగస్ట్ 7వ తేదీన బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.57,000 మార్క్ చేరుకున్న విషయం తెలిసిందే. వెండి రెండు రోజుల్లో దాదాపు రూ.3వేలు పెరిగింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధరలు తిరిగి 2000 డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ 0.23 శాతం క్షీణించడంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. వెండి ఔన్స్ 1 శాతం పెరిగి 27.69 శాతం పెరిగింది. ప్లాటినమ్ 0.9 శాతం పెరిగి 957.73 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గత పది సెషన్లలోనే పసిడి ధర రికార్డ్ ఔన్స్ 2,075, అలాగే కనిష్టం 1,863 డాలర్లు కూడా చూసింది. అంటే తక్కువ రోజుల్లో ఏకంగా 200 డాలర్ల మేర పెరిగి, తగ్గింది. ఇప్పుడు క్రమంగా మళ్లీ 2000 డాలర్లకు చేరుకుంది. పసిడి ధరలు తిరిగి 2030 నుండి 2033 డాలర్ల వద్దకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి పసిడికి అనుకూలంగా ఉంటే 2050 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా



Click it and Unblock the Notifications