భారతదేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగు రోజులు పాటు తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్ళీ మూడు రోజులుగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇక నేడు ఏకంగా మళ్లీ 60 వేల మార్కుకు స్వచ్ఛమైన బంగారం ధరలు చేరుకోగా, ఆర్నమెంట్ గోల్డ్ 55 వేల రూపాయలకు చేరుకుంది. దీంతో బంగారం ప్రియులు పెరుగుతున్న బంగారం ధరలతో లబోదిబోమంటున్నారు.
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు
బంగారం ధరల విషయానికి వస్తే గత 24 గంటలలో దేశీయంగా బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల మీద 300 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 330 రూపాయల మేర బంగారం ధర పెరిగింది. ఇక వెండి ధర కూడా ఆల్ టైం రికార్డును తాకింది 77,500 రూపాయలకు వెండి ధర చేరుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు 55,000గా ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,000 రూపాయలుగా ఉంది.

ఏపీ, తెలంగాణాలలో బంగారం ధరలిలా
హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, నిజామాబాద్, ఖమ్మం లలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా విక్రయించబడుతుంది.
ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 150 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 60, 150 రూపాయలుగా విక్రయించబడుతుంది. ఇక బెంగళూరులో ప్రస్తుతం 55,050 రూపాయలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం బెంగళూరులో 60 వేల 50 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా కొనసాగుతుంది.

ఆల్ టైం రికార్డ్ కు వెండి ధరలు
ఇక బంగారం ధరలు ఇలా ఉంటే వెండి ధరలు కూడా ఒక్కసారిగా భారీగా పెరిగాయి. నేడు కిలో వెండి పై 1300 రూపాయలు పెరిగి 77,500 రూపాయలకు ధర చేరుకుంది. ఇప్పటివరకు వెండి ఇంత భారీ మొత్తంలో ధరలు నమోదు చేయడం ఇదే ప్రథమంగా కనిపిస్తుంది. ఇక ముందు ముందు కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications