కరోనా మహమ్మారి కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ చాలామంది ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. దీంతో పసిడి ధర రోజు రోజు పెరుగుతోంది. మధ్యలో స్వల్పంగా తగ్గినప్పటికీ భారీగానే పెరుగుతోంది. గత ఏడెనిమిది నెలల్లోనే ధర రూ.12వేల వరకు పెరిగింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూ.82,000కు బంగారం ధర
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈక్విటీ, బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడం మంచిదని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ (BofA Sec) కూడా అదే చెబుతోంది. 2021 చివరి నాటికి బంగారం ధరలు ఔన్స్‌కు 3,000కు చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది. అంటే మన వద్ద 10 గ్రాముల బంగారం రూ.82,000కు చేరుకునే అవకాశముంది.

75 శాతం పెరుగుదల నమోదు
గురువారం ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,352 వద్ద ముగిశాయి. అంటే రానున్న ఏడాదిన్నరలో బంగారం ధరలు ఇండియాలో 75 శాతం మేరకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ 1,750 డాలర్ల వద్ద ఉంది.

వాటి కంటే బంగారం బెట్టర్
మరో గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ అనలిస్ట్స్ గోల్డ్‌మన్ సాక్స్ కూడా బంగారం ధరలు భారీగా పెరుగవచ్చునని అంచనా వేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీ, బాండ్స్‌తో పాటు చమురుపై పెట్టుబడుల కంటే కూడా బంగారంపై పెట్టుబడి సురక్షితం, మంచి ఎంపికగా భావిస్తోంది. క్రూడాయిల్ ధరలు నెగిటివ్‌లోకి వెళ్లవచ్చునని మార్చి చివరలోనే గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. ఇటీవల చమురు ధరలు మైనస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

రానున్న 18 నెలల కాలంలో బంగారం జూమ్
నామినల్ జీడీపీ, సెంట్రల్ బ్యాంకు బ్యాలెన్స్ షీట్ లేదా గోల్డ్ నిల్వలు కీలకం. వివిధ కారణాల వల్ల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 18 నెలల కాలంలో బంగారం ధర 2,000 డాలర్ల నుండి 3,000 డాలర్లకు చేరుకోవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది.

నేటి బంగారం ధర
బంగారం ధరలు ఇప్పటికే రూ.47,000కు సమీపంలో ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 46,500 పలికింది. ఉదయం ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ కాంట్రాక్ట్ 0.16 శాతం పెరిగి రూ.46,501గా ఉంది. వెండి కిలో ధర రూ.41,998గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1745 డాలర్లు, వెండి 15.35 డాలర్లుగా ఉంది.
More From GoodReturns

Financial planning: ఉద్యోగం ఊడినా, ఖర్చులు పెరిగినా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications