ఈ సంవత్సరం 'బంగారమే'! వచ్చే అక్షయ తృతీయ నాటికి షాకవ్వాల్సిందే

ఇప్పటికే గత ఏడాది ఆర్థిక మందగమనంతో దెబ్బతిన్న ప్రపంచాన్ని, ఇప్పుడు కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్‌కు ప్రపంచం ఎప్పుడు ముగింపు పలుకుతుందో తెలియని పరిస్థితి. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎక్కువగా ఆరోగ్యం పైనే దృష్టి సారించాల్సి వస్తోంది. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చమురుకు డిమాండ్ లేక ధరలు ఓ సయయంలో మైనస్‌లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు.

గత ఏడాది కంటే వేగంగా పెరుగుతున్న బంగారం ధర

గత ఏడాది కంటే వేగంగా పెరుగుతున్న బంగారం ధర

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారానికి డిమాండ్ వచ్చింది. ఈ క్యాలెండర్ ఇయర్ (2020) 'బంగారం' సంవత్సరంగా నిలిచిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత క్యాలెండర్ ఏడాదిలో పసిడి ధరలు ఏకంగా 23 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకే 21 శాతం పెరిగాయి.

బంగారానికి డిమాండ్

బంగారానికి డిమాండ్

కరోనా కారణంగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. మానిటరీ పాలసీలను సులభతరం చేస్తున్నాయి. కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం వంటి అతి ఖరీదైన లోహాలకు మాత్రమే డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.

సెంట్రల్ బ్యాంకుల చూపు బంగారం వైపు

సెంట్రల్ బ్యాంకుల చూపు బంగారం వైపు

ప్రపంచంలోనే బంగారం వినియోగించే దేశాల్లో, చైనా, ఇండియా మొదటి వరుసలో ఉంటాయి. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయమేమంటే టర్కీ, రష్యా, మంగోలియా వంటి దేశాలు కూడా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. కాబట్టి బంగారానికి ఈ ఏడాది మరింత డిమాండ్, మరింత పెరుగుదల ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఫిజికల్ గోల్డ్‌కు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ ఫండ్, సావరీన్ గోల్డ్ బాండ్స్ మంచి ప్రత్యామ్నాయాలు. అంటే స్టోరేజ్ సమస్యకు ఇబ్బందులు ఉండవు.

40 శాతం పెరుగుదల.. వచ్చే అక్షయ తృతీయ నాటికి..

40 శాతం పెరుగుదల.. వచ్చే అక్షయ తృతీయ నాటికి..

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు రూ.46,000 వరకు ఉన్నాయి. వచ్చే ఏడాది ఇదే అక్షయ తృతీయ సమయానికి రూ.52,000 దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బంగారం ధరలో 40 శాతం పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి రూ.50,000 ఉండవచ్చునని అంటున్నారు. 2021 చివరి నాటికి రూ.82,000కు చేరుకోవచ్చునని కూడా కొన్ని ఏజెన్సీలు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఔన్స్ బంగారం 2000

ఔన్స్ బంగారం 2000

అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదిలోపు బంగారం ధరలు ఔన్స్ 2,000 డాలర్లకు చేరుకుంటాయని, మన దేశంలో ఇది రూ.52,000 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చునని సూచనలు చేస్తున్నాయి. అయితే ఇది కరోనా ప్రభావంపై ఆధారపడి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో అయితే మంచిదే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+