బంగారం ధరలు నిన్న (ఏప్రిల్ 18) భారీగా తగ్గాయి. ముంబై బులియన్ మార్కెట్‌లో ఏకంగా రూ.1,215 తగ్గి రూ.45,713కు చేరుకుంది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో పసిడికి డిమాండ్ తగ్గింది.

ఎంసీఎక్స్‌లో రూ.1500 తగ్గుదల
ఎంసీఎక్స్‌లో బంగారం జూన్ ఫ్యూచర్స్ రూ.1500 తగ్గి రూ.45,685 పలికింది. మే సిల్వర్ కిలో 4 శాతం రూ.42,667 పలికింది. బంగారం ధరలు ఈ వారం రూ.47.327తో జీవనకాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో రూపాయి డాలర్ మారకంతో 76.87 జీవన కాల కనిష్టం పడిపోయింది. ఆ తర్వాత రూపాయి కోలుకోవడం, ట్రంప్ నిర్ణయాలతో నిన్న కాస్త పసిడిపై ఒత్తిడి తగ్గింది.

రిటైల్ మార్కెట్
ముంబై రిటైల్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 41,873 ప్లస్ 3 శాతం జీఎస్టీ పలికింది. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.45,713 ప్లస్ జీఎస్టీ. 18 క్యారెట్ల బంగారం రూ.34,285 ప్లస్ జీఎస్టీ పలికింది.

గత ఏడాది అలా.. ఇప్పుడు ఇలా
వృద్ధి రేటు మందగించడం, వడ్డీ రేట్లు పడిపోవడం వంటి కారణాలతో గత క్యాలెండర్ (2019) ఏడాదిలో బంగారం ధరలపై ప్రభావం పడిందని, కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని దీంతో మరింత ఒత్తిడి పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రానున్న రెండేళ్లలో 35 శాతం రిటర్న్స్
రానున్న రెండేళ్లలో బంగారంపై రిటర్న్స్ 30 శాతం నుండి 35 శాతం మేర ఉండవచ్చునని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాపై ప్రపంచ దేశాలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన సమయంలో పసిడిపై ఒత్తిడి తగ్గుతోంది.

ఇండియాలో ఆల్ టైమ్ హై, ఇంటర్నేషల్ మార్కెట్లో మాత్రం..
ఇప్పటికే ఇండియాలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయని చెప్పారు. రూపాయి బలహీనపడటం, దిగుమతి సుంకం పెరగడం వంటి వివిధ కారణాలు కూడా ఉన్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఆల్ టైమ్ గరిష్టానికి ఇంకా చేరుకోలేదని, ఆ సమీపంలో ఉన్నాయని చెబుతున్నారు.

ఈ వారం ఇలా ఉండవచ్చు
ఈ వారం కామెక్స్‌లో బంగారం ధరలు 1,680-1,725 డాలర్ల మధ్య ఉండవచ్చునని, డొమెస్టిక్ మార్కెట్లో రూ.45,500-46,450 మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూ.50 వేల నుండి రూ.62వేలకు..
పరిస్థితుల్లో మార్పు లేకుంటే మాత్రం బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1780 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. ఆ తర్వాత 2000 డాలర్లకు కూడా చేరుకోవడాన్ని కొట్టి పారేయలేమని అంటున్నారు. అదే జరిగితే భారతీయ మార్కెట్లో రూ.50,000 ఈజీగా చేరుకుంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా రూ.62,000 కూడా చేరుకోవచ్చునని చెబుతున్నారు.ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రూ.32 వేల కంటే తగ్గుదల మాత్రం ఉండదని చెబుతున్నారు.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications