అమెరికా-చైనా ట్రేడ్ వార్: బంగారం వెలుగులు తగ్గిపోతాయా?
బంగారం ధరలు త్వరలో తగ్గిపోవచ్చునని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ (WGC) అంచనా వేసింది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలకు ముగింపు రాలేదు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, కానీ తమ ప్రయోజనాలు పణంగా పెట్టలేమని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, చర్చలు ముగింపు దశకు వచ్చాయని చైనా చెబుతోంది. ఈ నేపథ్యంలో చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని అంచనా. అదే జరిగితే బంగారం ధరలు పడిపోతాయని భావిస్తున్నారు.

భారీగా పడిపోయిన దిగుమతులు
WGC ప్రకారం థర్డ్ క్వార్టర్‌లో బంగారు ఆభరణాలు, బార్స్, కాయిన్స్‌కు డిమాండ్ పడిపోయింది. 2019 థర్డ్ క్వార్టర్లో జ్యువెల్లరీ డిమాండ్ 16 శాతం పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో 546.2 టన్నులుగా ఉండగా, ఈ ఏడాది 460.9 టన్నులకు పడిపోయింది. 2010 తర్వాత ఈ క్వార్టర్లో దిగుమతులు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
నవంబర్ 8వ తేదీతో ముగిసిన వారంలో ఎంసీఎక్స్ గోల్డ్‌లో బంగారం 1.6 శాతం, కామెక్స్ గోల్డ్‌లో 3.6 శాతం తగ్గింది. డాలర్ వ్యాల్యూ 97.1 నుంచి 98.23కు పెరిగి 1 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలు ఎక్కువగా సఫలం అయ్యేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. WGC ప్రకారం గోల్డ్ జ్యువెల్లరీ, బార్స్, కాయిన్స్‌కు డిమాండ్ తగ్గింది. అదే సమయంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETFs)లో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. ETFలలో పెట్టుబడి 2018 క్వార్టర్ 3లో 194.4 టన్నులు ఉండగా, ఈ ఏడాది క్వార్టర్ 3లో 408.6 టన్నులుగా ఉంది. ఇది 110 శాతం అధికం.

బంగారానికి డిమాండ్ తగ్గవచ్చు
చైనా - అమెరికా వాణిజ్య చర్చలు, తదితర సానుకూల సంకేతాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గవచ్చునని చెబుతున్నారు. ట్రేడ్ టాక్స్‌పై ఆశావాదంతో ఉన్నామని, దిగుమతి సుంకాలు తగ్గించే పరిస్థితులు లేకపోలేదని ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గవచ్చునని చెబుతున్నారు. అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందం కుదిరితే టారిఫ్స్ ఎత్తివేయవచ్చునని బీజింగ్ చెబుతున్నప్పటికీ, అమెరికా దీనిపై సానుకూలంగా లేదు.

చర్చలు సానుకూలమైతేనే..
రిస్క్ మార్కెట్, డాలర్ పెరుగుదల, ఈక్విటీ అన్ని సమయాల్లో గరిష్టస్థాయికి చేరుకోవడాన్ని చూస్తున్నాము. సుంకాలను వెనక్కి తీసుకోవడానికి అమెరికా అంగీకరించిందని చైనా చెప్పడాన్ని డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు. దీంతో వాణిజ్య చర్చలు ఎటువైపు వెళ్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కానీ సానుకూలంగానే ముగుస్తాయని భావిస్తున్నారు. చర్చలు సానుకూలం అయితే మాత్రం బంగారానికి డిమాండ్ తగ్గుతుంది.


Click it and Unblock the Notifications