బంగారం, వెండి ఈ ధరకు రాగానే కొనుగోలు చేయండి.. ఇన్వెస్టర్లకు ఈ వారం నిపుణులు కీలక సూచన..
Gold Market Alert: దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలపై బేరిష్ ఒత్తిడి కొనసాగుతున్న వేళ.. స్వల్పకాలిక పునరుద్ధరణలను అమ్ముకునే (Sell-on-Rise) వ్యూహమే ప్రస్తుతానికి అనుకూలంగా ఉందని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ విభాగాధిపతి అభిలాష్ కోయిక్కర తెలిపారు. ఈ వారం ప్రారంభంలో కనిపించిన స్వల్ప సానుకూలత నిలకడగా లేకపోగా.. మరుసటి రోజే లాభాలు ఆవిరై వారపు కనిష్ఠ స్థాయిల వైపు ధరలు జారడం బలమైన డౌన్‌ట్రెండ్‌ను ధృవీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
MCX బంగారం (Gold) కదలికలను పరిశీలిస్తే.. గత వారం కనిష్ఠ స్థాయిని దాటి ఈ వారంలోనూ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తూ బేరిష్ మొమెంటమ్‌ను కొనసాగిస్తోంది. రివర్సల్ సంకేతాలు ఇంకా కనిపించనందున వారం చివరి వరకు ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని కోయిక్కర తెలిపారు. రూ. 1,12,000 వద్ద ఉన్న ట్రెండ్‌లైన్ సపోర్ట్ వైపు బంగారం కదులుతుండగా.. ఆ స్థాయి కంటే దిగువన ముగిస్తే తదుపరి మద్దతు రూ. 1,10,000 వద్ద ఉంటుందని అంచనా వేశారు.

మరోవైపు ఈ వారం గరిష్ఠమైన రూ. 1,27,000 వద్ద.. ఆ తర్వాత రూ. 1,30,000 బ్రేక్‌డౌన్ స్థాయి వద్ద గట్టి నిరోధం (Resistance) ఎదురుకానుంది. ఈ స్థాయిల పైన నిర్ణయాత్మకంగా ముగిస్తేనే బేరిష్ అంచనాలు మారతాయని.. అప్పటివరకు ధరలు పెరిగినప్పుడు విక్రయించే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. MCX గోల్డ్‌కు ప్రస్తుతం రూ. 1,20,600 సమీపంలో కదలాడుతుండగా లక్ష్యంగా రూ. 1,10,000.. స్టాప్‌లాస్‌గా రూ. 1,27,000 స్థాయిలను ఆయన పేర్కొన్నారు.
MCX గోల్డ్ లెవెల్స్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 120,600
లక్ష్యం: రూ. 1, 10,000
స్టాప్‌లాస్: రూ. 127,000
ఇక MCX వెండి (Silver) విషయానికి వస్తే.. గత వారం కనిష్ఠాల కంటే కిందకు జారుతూ వరుసగా మూడవ వారం కూడా కొత్త కనిష్ఠ స్థాయిలను ఏర్పరుస్తోంది. ధరలు 200-వారాల సింపుల్ మూవింగ్ యావరేజ్ (SMA) ను సమీపిస్తున్నప్పటికీ స్పష్టమైన మద్దతు దొరకడం లేదని, ఏ స్వల్ప పునరుద్ధరణనైనా ట్రెండ్ మారినట్లుగా భావించరాదని అభిలాష్ కోయిక్కర స్పష్టం చేశారు.
MCX సిల్వర్ ట్రేడింగ్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 142,000
లక్ష్యం: రూ. 120,000
స్టాప్‌లాస్: రూ. 156,000
వెండికి రూ. 1,30,000 తక్షణ మద్దతుగా ఉండగా.. దీనిని కోల్పోతే తదుపరి సపోర్ట్ రూ. 1,15,000 వద్ద ఉంది. పైవైపున రూ. 1,56,000, రూ. 1,70,000 స్థాయిలలో బలమైన నిరోధం ఎదురవుతుందని.. ఆ స్థాయిల వద్దకు చేరితే వారపు నిర్ధారణ ఆధారంగా షార్ట్ పొజిషన్ల వైపు చూడవచ్చని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం రూ. 1,42,000 స్థాయి వద్ద ఉన్న MCX సిల్వర్‌కు రూ. 1,20,000 లక్ష్యంగా.. రూ. 1,56,000 స్టాప్‌లాస్‌గా నిలుస్తున్నాయని ఆయన వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
