రూ.48,000 దిగువనే బంగారం ధరలు, వెండి రూ.61,000 దిగువకు
బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. యూఎస్ జాబ్ డేటా, అధిక ద్రవ్యోల్భణం వంటి అంశాలు పసిడి ధరకు ఊతమిస్తున్నాయి. అదే సమయంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ధరలు స్వల్పంగా మాత్రమే పెరుగుతున్నాయి. అయినప్పటికీ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.48,000కు దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ధరలు 1810 డాలర్లకు దిగువన ఉన్నాయి. వెండి ధరలు రూ.61,000కు సమీపంలో ఉన్నాయి.

గోల్డ్ ఫ్యూచర్ ధర
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43 పెరిగి రూ.47960.00 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.26 ఎగిసి రూ.48,122 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్ ప్రస్తుతం రూ.8200 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.35 డాలర్లు లాభపడి 1807 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు గోల్డ్ ఫ్యూచర్ 1,805.15 - 1,808.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్ 1804 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్ 2.22 డాలర్ల మేర క్షీణించింది.

సిల్వర్ ఫ్యూచర్
మార్చి సిల్వర్ ఫ్యూచర్ రూ.242 పెరిగి రూ.60,974 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.282.00 ఎగిసి రూ.61,772 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ 0.135 డాలర్లు లాభపడి 22.512 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టంతో రూ.18000 వరకు తక్కువగా ఉంది. కామెక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టంతో 7 డాలర్ల మేర తక్కువగా ఉంది.

అందుకే ధరలు ఇలా
యూఎస్ జాబ్ డేటా, అధిక ద్రవ్యోల్భణం వంటి అంశాలు పసిడి ధరకు ఊతమిస్తున్నాయి. అదే సమయంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి.


Click it and Unblock the Notifications