పసిడి ప్రియులకు షాకిస్తూ.. మళ్ళీ బంగారం ధరల రికార్డులు బద్దలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
నిన్న కాస్త క్షీణించిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బంగారం ప్రియులకు ఊహించని షాక్ ఇస్తూ బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. నేడు దేశంలో బంగారం ధరల భగభగ సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఆలోచించే స్థాయికి పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో విపరీతమైన పెరుగుదల నమోదయింది. భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు :ఇక తాజాగా దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే భారతదేశంలో గత 24 గంటల్లో బంగారం ధర భయంకరంగా పెరిగిపోయింది . నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 54,700 ధర ఉండగా, నేడు ఏకంగా 600 రూపాయలు పెరిగి 55,300 రూపాయలకు ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,670 రూపాయలు ఉండగా నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
రికార్డ్ బ్రేక్ చేసిన బంగారం ధరలు: గతంలో ఓమారు బంగారం ధర 60 వేలు దాటి రికార్డు బ్రేక్ చేస్తే, మళ్లీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ 60 వేల 330 రూపాయలతో స్వచ్ఛమైన బంగారం ధరలు ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 330 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా : దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55450 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,480 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 55,300గా ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలకు విక్రయించబడుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55350 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 60,380 రూపాయలుగా కొనసాగుతుంది.
ఏపీ, తమిళనాడులలో బంగారం ధరలు ఇలా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా విక్రయించబడుతుంది. దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉంటే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుపూరు, తిరుచ్చి, తిరునవ్వేలి, ఈరోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,000 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,090 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications