బంగారం ధరలు భారీగా క్షీణించాయి. రెండు మూడు సెషన్‌లోనే పసిడి ధర రూ.2000 వరకు క్షీణించింది. జెలెన్‌స్కీ వెనక్కి తగ్గిన నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. యుద్ధం దాదాపు నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. పరిస్థితి సద్దుమణుగుతున్న దిశగా కనిపించడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి నుండి ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు వెళ్తున్నారు. దీంతో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.215 క్షీణించి రూ.52,530 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.231 తగ్గి రూ.53,032 వద్ద కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి పది డాలర్ల దూరంలో మాత్రమే కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు దాదాపు 100 డాలర్ల మేర తక్కువగా ఉంది. ఈ వార్త రాసే సమయానికి కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.75 డాలర్లు తగ్గి 1986 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలకు 1850 డాలర్ల వద్ద కీలక మద్దతు కనిపిస్తోంది.

సిల్వర్ ధరలు కూడా భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ధరలూ 26 డాలర్ల దిగువకు వచ్చాయి. 0.049 డాలర్లు లేదా 0.19 శాతం క్షీణించి 25.865 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లోను మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.107 తగ్గి రూ.69,468 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.212 తగ్గి రూ.70,155 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 దిగువకు వచ్చాయి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్‌లో అసలేమి జరుగుతోంది..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications