నిన్న భారీగా పెరిగి, నేడు తగ్గిన బంగారం ధరలు: పెరిగే అవకాశముందా?
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు (అక్టోబర్ 5, మంగళవారం) స్వల్పంగా క్షీణించాయి. ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.147.00 (-0.31%) క్షీణించి రూ.46740.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.162.00 (-0.34%) తగ్గి రూ.46915.00 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.333.00 (-0.55%) తగ్గి రూ.60620.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.302.00 (-0.49%) క్షీణించి రూ.61133.00 వద్ద ట్రేడ్ అయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 7.00 (-0.40%) డాలర్లు క్షీణించి 1,760.45 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.156
(-0.69%) డాలర్లు తగ్గి 22.488 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
గోల్డ్ ఫ్యూచర్స్ దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.46,700కు పైన, అంతర్జాతీయ మార్కెట్లో 1760 డాలర్లకు పైనే ఉంది. ఇక, బంగారం ఫ్యూచర్ ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో క్రితం సెషన్‌లో రూ.371కి పైగా లాభపడి రూ.46,877 వద్ద, కామెక్స్‌లో 6 డాలర్లకు పైగా క్షీణించి 1761.35 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ఫ్యూచర్స్ రూ.61,000 స్థాయికి నిన్న చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను సిల్వర్ ఫ్యూచర్స్ 22 డాలర్లను దాటింది. క్రూడాయిల్ ధరలు పెరుగుదల, డాలర్ క్షీణించడంతో నిన్న బంగారం ధరలు పెరిగాయి. నేడు కాస్త క్షీణించాయి.

బంగారం ధరలు ఈ వారం అస్థిరంగా ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్ మళ్లీ క్షీణించే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రభావం పడి బంగారం ధరలు కాస్త పెరగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1,750-1,740 డాలర్లు, నిరోధకస్థాయి 1,780-1,794 డాలర్లు, వెండి మద్దతు ధర 22.40-22.20 డాలర్లు, నిరోధకస్థాయి 22.90-23.00 డాలర్లు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.46,660-రూ.46,480, నిరోధకస్థాయి రూ.47,050-రూ.47,220, సిల్వర్ మద్దతు ధర రూ.60,600-రూ.60,100, నిరోధకస్థాయి రూ.61,400-రూ.61,900గా పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications