మీ తల్లిదండ్రుల నుండి మీరు బంగారు ఆభరణాలను వారసత్వంగా పొందినట్లయితే.. అది ఆదాయపు పన్ను కిందకు వస్తుందా అనే సందేహం మీకు కలగడం సహజం. శుబవార్త ఏమిటంటే, భారతదేశంలో వారసత్వంగా వచ్చిన బంగారం పన్ను విధింపు లేని ఆస్తిగా పరిగణించబడుతుంది. అంటే, మీరు వాటిని కలిగి ఉన్నందుకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే ఈ బంగారం ఆభరణాలను మీరు అమ్మాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ పన్ను అంశం ప్రస్తావనకు వస్తుంది. ఆ దశలో మీరు పొందిన లాభాన్ని మూలధన లాభాలు (Capital Gains)గా పరిగణిస్తారు. ముఖ్యంగా బంగారం అమ్మిన మొత్తం పూర్తిగా పన్నులకు ఆ క్రమంలో గణించబడదు. వారసత్వం పొందిన వ్యక్తి ముందుగా చెల్లించిన ధరను పరిగణించి లాభాన్ని లెక్కిస్తారు.ఈ సందర్భంలో, మీరు ఎంత లాభం పొందారో (అంటే అమ్మిన ధర - ఆధార ధర) దానిపై పన్ను ఉంటుంది. ఈ లాభాన్ని "Capital Gains" అంటారు.

సిఎ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మీరు అమ్మిన సమయానికి ఉన్న FMV (Fair Market Value)ని ఆదారంగా తీసుకొని పన్ను లెక్కింపునకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా, మీరు పొందిన Gold 2001 ఏప్రిల్ 1కు ముందు కొనుగోలు చేయడం జరిగితే ఆ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువను ఆధారంగా తీసుకోవచ్చు. దీంతో ద్రవ్యోల్బణాన్ని పరిగణించి లాభాన్ని లెక్కించేందుకు Cost Inflation Index (CII) ను ఉపయోగిస్తారు.
పాత నియమాల ప్రకారం Gold అమ్మిన 36 నెలల్లోపు అది స్వల్పకాలిక ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. అందుకే లాభంపై వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను ఉండేది. అయితే.. 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన బంగారం దీర్ఘకాలిక ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి దీర్ఘకాలిక లాభంపై 20 శాతం పన్ను ఉండేది.. అయితే ఇండెక్సేషన్ ప్రయోజనం కూడా అందించండి జరిగేది.
అయితే తాజా ఆర్థిక చట్టం (Finance Act 2024) ప్రకారం.. జూలై 23, 2024 నుంచి కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు 24 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన బంగారాన్ని దీర్ఘకాలిక ఆస్తిగా పరిగణిస్తారు.అంటే దీర్ఘకాలిక లాభంపై 12.5% ఫ్లాట్ పన్ను ఉంటుంది. కొత్త నియమ ప్రకారం ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా మాత్రమే 12.5% ఫ్లాట్ పన్ను విధిస్తారు. 24 నెలల్లోపు అమ్మితే, లాభం స్వల్పకాలికంగా పరిగణించబడుతుంది. దీనిపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.
ఉదాహరణ:
మీరు 10 గ్రాముల బంగారం వారసత్వంగా పొందారు.
ఆ బంగారం ఇప్పుడు మార్కెట్‌లో రూ. 60,000కి అమ్మాలనుకుంటున్నారు.
అయితే, కొనుగోలు ధర (FMV) రూ. 40,000 అని పరిగణిస్తారు.
లాభం: రూ. 60,000 - రూ.40,000 = రూ.20,000
దీర్ఘకాలిక పన్ను: 12.5% × రూ. 20,000 = రూ. 2,500 పన్ను చెల్లించాలి.
క్లుప్తంగా చెప్పాలంటే.. మీరు వారసత్వంగా పొందిన బంగారం ఆభరణాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాని మీరు ఆభరణాలను అమ్మినప్పుడు మాత్రమే లాభంపై పన్ను వర్తిస్తుంది. కొత్త నియమాలు దీర్ఘకాలిక పన్నును మరింత సులభతరం చేయగా, 12.5% ఫ్లాట్ రేటు ఉంది. స్వల్పకాలిక విక్రయాలపై నిబంధిత ఆదాయపు పన్ను రేట్లు వర్తిస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Tax Regime: జీతం పెరిగినా చేతికి వచ్చే డబ్బు తగ్గుతుందా? కొత్త టాక్స్ రూల్స్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications