బంగారం కొంటున్నారా.. అయితే ఈ పన్ను రేట్లు గురించి తప్పక తెలుసుకోండి
భారతదేశంలో బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. MCX (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్) లో లభ్యమయ్యే తాజా డేటా ప్రకారం, గత ఏడాది బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే గత మూడు సంవత్సరాల్లో సుమారు 30 శాతం CAGR (సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు) నమోదు చేశాయి. పండుగల సీజన్‌కి అనుగుణంగా ఆభరణాలు, బార్లు, నాణేలు, గోల్డ్ ETFలు, SGBలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి.
NA షా అసోసియేట్స్ LLP డైరెక్ట్ టాక్స్ భాగస్వామి మిలిన్ బఖాయ్ అభిప్రాయం ప్రకారం..బంగారం సంప్రదాయ ఆభరణాలకే పరిమితం కాదు. ఇది ఇప్పుడు సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతోంది. ETFలు, SGBలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు వంటి ఆధునిక మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.కానీ, ఏ రూపంలో బంగారం కొనుగోలు చేసినా అది విక్రయించినప్పుడు లాభాలపై పన్ను తప్పనిసరి. మినహాయింపు మాత్రం SGBలను మెచ్యూరిటీ వరకు ఉంచినపుడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ప్రతి రూపంలోని బంగారంపై పన్ను ఎలా విధించబడుతుందో చూద్దాం.

1. బంగారం కొనుగోలు సమయంలో పన్ను: బంగారం కొనుగోలు చేసినప్పుడు ఆదాయపు పన్ను (Income Tax) ఉండదు.అయితే 3 శాతం GST Gold ధరపై విధించబడుతుంది. తయారీ ఛార్జీలపై 5 శాతం GST చెల్లించాలి. ఈ ఖర్చులు ఆభరణాల తుది ధరను పెంచుతాయి.
2. భౌతిక బంగారం అమ్మకాలపై పన్ను (Jewellery, Coins, Bars): 2024 జూలై 23న అమల్లోకి వచ్చిన ఆర్థిక చట్టం 2024 (Finance Act 2024) ప్రకారం, భౌతిక బంగారం అమ్మకాలపై పన్ను విధానంలో కీలక మార్పులు జరిగాయి.ఇప్పుడు ఇండెక్సేషన్ ప్రయోజనం (Indexation Benefit) అందుబాటులో లేదు. 24 నెలల లోపు అమ్మితే దానిని Short Term Capital Gains (STCG) గా పరిగణించబడుతుంది. పన్ను మీ స్లాబ్ రేట్ల ప్రకారం ఉంటుంది.ఇక 24 నెలల తర్వాత అమ్మితే Long Term Capital Gains (LTCG) వర్తిస్తుంది. ఫ్లాట్ 12.5 శాతం పన్ను విధించబడుతుంది (ఇండెక్సేషన్ లేదు).
3. గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లపై పన్ను: గోల్డ్ ETFలు అత్యంత స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెడతాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు వీటిలోనే పెట్టుబడి పెడతాయి. 12 నెలల లోపు అమ్మితే STCGగా పరిగణించబడుతుంది. స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చూసుకున్నట్లయితే.. 12 నెలల తర్వాత అమ్మితే.. LTCG వర్తిస్తుంది. ఇండెక్సేషన్ లేకుండా 12.5 శాతం పన్ను విధించబడుతుంది.
4. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) పై పన్ను: SGBలు భారత ప్రభుత్వం తరఫున RBI జారీ చేసే సెక్యూరిటీలు. 8 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ అందిస్తాయి. 999 స్వచ్ఛత గల బంగారం ఆధారంగా జారీ అవుతాయి. మెచ్యూరిటీ వరకు ఉంచితే లాభాలపై ఎటువంటి ఆదాయపు పన్ను ఉండదు. అలాగే మెచ్యూరిటీకి ముందు అమ్మితే 12 నెలల లోపు STCG - స్లాబ్ రేట్లపై పన్ను. 12 నెలల తర్వాత.. LTCG 12.5శాతం పన్ను ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు.
Gold పెట్టుబడులు భద్రమైనవి అయినా.. పన్ను నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు భౌతిక బంగారం, ETFలు, మ్యూచువల్ ఫండ్లు లేదా SGBల్లో పెట్టుబడి పెట్టినా.. దానికి సంబంధించి పన్ను విధానం వేరువేరుగా ఉంటుంది. SGBలు మాత్రమే మెచ్యూరిటీ వరకూ ఉంచితే పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయి. మిగతా రూపాల్లో లాభాలపై 12.5 శాతం పన్ను తప్పదని గుర్తుంచుకోండి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications