తగ్గుతున్న బంగారం ధరలు, కానీ రూ.49,000కు పైనే
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.. అయితే ఇది స్వల్పమే. డాలర్ వ్యాల్యూ పెరగడం, టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ ప్రభావం బంగారంపై ఉంటోంది. దాదాపు వారం రోజులపాటు ర్యాలీ చేసిన బంగారం మూడు రోజులుగా స్వల్పంగా క్షీణించింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (గురు వారం) ప్రారంభ సెషన్‌లో రూ.113.00 (-0.23%) క్షీణించి రూ.49179.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ప్యూచర్స్ రూ.90.00 (-0.18%) తగ్గి రూ.49420.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ 2.55 (-0.14%) క్షీణించి 1,867.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం క్రితం సెషన్లో 1,870.20 డాలర్ల వద్ద ముగిసింది.
సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.289.00 (-0.43%) క్షీణించి రూ.66336.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.227.00 (-0.34%) నష్టపోయి రూ.67300.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల స్థాయికి వచ్చింది. నేడు 0.105 (-0.42%) డాలర్లు క్షీణించి 25.062 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ క్రితం సెషన్లో 25.167 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఇటీవల తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకున్నాయి.

ప్రస్తుతం పసిడి ధరలు అతి స్వల్ప దిద్దుబాటులో ఉన్నాయని, మరింత దిద్దుబాటు కనిపిస్తోందని, ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాల పెట్టుబడిదారులు ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.49,100-48,920, నిరోధకస్థాయి రూ.49,550-49,770, వెండి మద్దతు ధర రూ.66,200-65,800, నిరోధకస్థాయి రూ.67,100-67,700. రూ.49,750 టార్గెట్ ధరతో రూ.48,900 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.49,200 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications