For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన బంగారం దిగుమతులు, కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం

|

కరెంట్ ఖాతా లోటు పైన (CAD) నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో దిగుమతులు 26.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2022లో బంగారం దిగుమతులు 11.45 శాతం క్షీణించి 4.7 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

పసిడి దిగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ లోటు 86 బిలియన్ డాలర్లుగా నమోదయింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు మరింత పెరిగే అవకాశముందని, ఇది కరెంట్ ఖాతా లోటు పైన మరింత ఎత్తిడి పెరగవచ్చునని అంటున్నారు.

Gold imports surge to $45 billion in April-Feb this fiscal

ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశం భారత్. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలు ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. పైన తెలిపిన 9 నెలల వ్యవధిలో భారత్ 842.28 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రత్నాభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

English summary

భారీగా పెరిగిన బంగారం దిగుమతులు, కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం | Gold imports surge to $45 billion in April-Feb this fiscal

India's gold imports, which have a bearing on the country's current account deficit, surged by about 73 per cent to $45.1 billion during April-February this fiscal on account of higher demand, according to official data. The imports stood at $26.11 billion in April-February 2021.
Story first published: Sunday, March 13, 2022, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X