న్యూఢిల్లీ: కరెంట్ ఖాతా లోటు(CAD)కి కారణమవుతున్న బంగారం దిగుమతులు 9% తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ నెలకు వీటి విలువ 17.63 బిలియన్ డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో రూ.1.25 లక్షల కోట్లు. గత ఏడాది ఇధే సమయంలో 19.4 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.

బంగారం దిగుమతి తగ్గి.. వాణిజ్య లోటు కూడా...
బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గింది. గత ఏడాది 116.15 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 94.72 బిలియన్ డాలర్లకు తగ్గింది. విదేశాల నుంచి బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. ప్రతి ఏడాది 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో జ్యువెల్లరీ పరిశ్రమ నుంచి బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది.

దిగుమతి తగ్గడానికి కారణాలు...
గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు పెరగడంతో పాటు ఇది కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది జూలై నుంచి బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదు అవుతోంది. అయితే అక్టోబర్ నెలలో మాత్రం 5 శాతం పెరిగి 1.84 బిలియన్ డాలర్లుగా ఉంది.

దిగుమతి సుంకం 4 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి
బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (GJEPC) విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 2% తగ్గి 1,830 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతులు 3% తగ్గి 3,280 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications