బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్ 5, సోమవారం) ప్రారంభ సెషన్‌లో స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి 0.9 శాతం క్షీణించి రూ.50,130 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 0.88 శాతం పెరిగి రూ.60,605 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం ధరలు 0.4 శాతం పెరిగాయి. వెండి 1.6 శాతం ఎగిసింది. శుక్రవారం గాంధీ జయంతి పబ్లిక్ హాలీడే సందర్భంగా ఎంసీఎక్స్ క్లోజ్‌గా ఉంది. ఆగస్ట్ 7న బంగారం రూ.56,200తో, వెండి రూ.79,000తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.

నెల రోజులతో పోలిస్తే తక్కువ
పసిడి ధరల్లో గత నెల రోజులతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో సెప్టెంబర్ నెల 8న 10 గ్రాముల పసిడి రూ.50,967 పలికింది. గత నెల చివరలో రూ.50వేల దిగువకు వచ్చింది. అయితే వారం రోజులుగా ధరలు పెరగడంతో తిరిగి 50,000 మార్క్ దాటింది. ఇప్పుడు రూ.50,250 పలికింది.
గోల్డ్ ఫ్యూచర్స్ గత నెల 8న రూ.50,967 పలికింది. గత నెల చివరలో రూ.49,700 దిగువకు వచ్చింది. గత వారం రోజులుగా ధరలు పెరగడంతో రూ.50,300కు చేరుకున్నాయి. అయితే నెల రోజుల క్రితం ధరలతో పోలిస్తే స్పాట్ గోల్డ్, ప్యూచర్ మార్కెట్ రూ.500కు పైగా తక్కువగా ఉంది. ఆల్ టైమ్ హై రూ.56,200తో పోలిస్తే ఇప్పటికీ రూ.5,500కు పైగా తక్కువతో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
ఇన్వెస్టర్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో స్వల్పమార్పులు ఉన్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర దాదాపు 1,900 డాలర్లకు కాస్త పైగా ఉంది. 0.1 శాతం క్షీణించి 1,906.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. స్పాట్ గోల్డ్ 1,896.21 డాలర్లు పలికింది.
ఆసియా ఈక్విటీ మార్కెట్లు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని మొదట వార్తలు రాగా, ఆ తర్వాత ఆరోగ్యం బాగానే ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పసిడి 0.8 శాతం పెరిగి ఔన్స్ 23.89 డాలర్లకు, ప్లాటినమ్ 0.1 శాతం క్షీణించి 881.51 డాలర్లు పలికింది. పల్లాడియం స్వల్పమార్పుతో 2,307.64 డాలర్లుగా ఉంది.

ఈ వారం పసిడి ధర ఎలా ఉండనుంది
ఈవారం పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.49,600 కంటే దిగువకు రాకుంటే సానుకూల ధోరణి సాగే అవకాశాలు ఉన్నాయి. ట్రేడర్లు రూ.50,693 స్థాయి అధిగమించకుంటే కాంట్రాక్ట్ డీలా పడే అవకాశాలు ఉననాయి. ఆ సమయంలో లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండాలి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలు కాంట్రాక్టుకు దిశా నిర్దేశనం చేస్తాయి.
More From GoodReturns

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications