బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. క్రితం సెషన్లో రూ.51,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్ నేడు మరింత క్షీణించి రూ.50,500 స్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1835 డాలర్ల దిగువకు పడిపోయింది. డాలర్ వ్యాల్యూ పుంజుకోవడం, యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరరగడం వంటి అంశాలు పసిడి క్షీణతకు కారణాలు. దీంతో గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం రెండు వారాల కనిష్టానికి పడిపోయాయి.
నేటి ప్రారంభ సెషన్లో ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.345 తగ్గి రూ.50,510 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.349 క్షీణించి రూ.50,498 వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై నేటి ప్రారంభ సెషన్లో రూ.585 తగ్గి రూ.60,540 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.574 తగ్గి రూ.61,269 వద్ద కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధర ప్రస్తుతం రూ.5700 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోను క్రితం సెషన్లో 1850 డాలర్లు క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1835 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ (ఆగస్ట్ 22) ఈ వార్త రాసే సమయానికి 16 డాలర్లు లేదా 0.86 డాలర్లు క్షీణించి 1832 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.250 డాలర్లు లేదా 1.15 శాతం తగ్గి 21.438 డాలర్ల వద్ద కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే పసిడి ప్రస్తుతం 240 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.
More From GoodReturns

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications