ముంబై: బంగారం ధరలు వరుసగా ఐదో రోజు క్షీణించాయి. అయితే నేడు ఉదయం సెషన్‌లో భారీగా తగ్గినప్పటికీ సాయంత్రం సెషన్‌కు తగ్గుదలతో ఉన్నప్పటికీ ఉదయం కంటే పెరిగాయి. నేడు (ఏప్రిల్ 28, బుధవారం) బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9000 వరకు తక్కువగా ఉంది. గతవారం పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 48,000 క్రాస్ చేసింది. అయితే ఇప్పుడు తిరిగి రూ.47,000 దిగువకు వచ్చాయి. గత వారం రూ.2000కు పైగా పెరిగిన గోల్డ్ ఈ వారం స్వల్పంగా తగ్గాయి.

ఉదయం భారీగా తగ్గి, సాయంత్రానికి...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.353.00 (0.75%) తగ్గి రూ.46950.00 వద్ద ట్రేడ్ కాగా, సాయంత్రానికి రూ.47,000 క్రాస్ చేసింది. సాయంత్రం సెషన్‌లో రూ.159.00 (0.34%) మాత్రమే తగ్గి రూ.47,144 వద్ద ట్రేడ్ అయింది. ధర నిన్నటి కంటే తగ్గినప్పటికీ, ఉదయం కంటే రూ.200 పెరిగింది. రూ.47,150.00 ప్రారంభమైన ధర, రూ.47,273.00 గరిష్టాన్ని, రూ.46,800.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.138.00 (0.29%) తగ్గి రూ.47,442 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,425.00 వద్ద ప్రారంభమై, రూ.47,497.00 గరిష్టాన్ని, రూ.47,120.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.800 డాన్
వెండి ఫ్యూచర్ ధరలు కూడా తగ్గినప్పటికీ, ఉదయం కంటే రూ.400 పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం రూ.1,218.00 (1.77%) తగ్గి రూ.67740.00 వద్ద ట్రేడ్ కాగా, సాయంత్రానికి రూ.808.00 (-1.17%) క్షీణించి రూ.68150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,680.00 వద్ద ప్రారంభమై, రూ.68,680.00 గరిష్టాన్ని, రూ.67,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.848.00 (-1.21%) తగ్గి రూ.69352.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,498.00 ప్రారంభమైన ధర, రూ.69,618.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,760.00 కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 4.45 (0.25%) డాలర్లు తగ్గి 1,774.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,761.90 - 1,776.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. ప్రారంభంలో 26 డాలర్ల దిగువకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పెరిగింది. 0.277 (1.05%) డాలర్లు తగ్గి 26.133 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.860 - 26.325 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications