For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధర, ఈవారం రూ.2,500 డౌన్: ఆల్‌టైం హైతో వెండి రూ.20,000 తగ్గింది

|

ఈ వారం ప్రారంభం నుండి బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఏకంగా రూ.50,000 దిగువకు పడిపోయాయి. నిన్న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ రూ.49,660 కనిష్టం కూడా పలికింది. వెండి ఫ్యూచర్స్ 3 శాతం క్షీణించి కిలో రూ.59,429 పలికి, చాలా రోజులకు రూ.60వేల దిగువకు వచ్చింది. గత నెలలో పసిడి రూ.56,200 దాటగా, వెండి కిలో రూ.78వేలకు చేరుకుంది. నిన్నటి వరకు గరిష్ట ధరలతో పోలిస్తే పసిడి రూ.6వేలకు పైగా తక్కువగా ఉండగా, వెండి ఏకంగా రూ.18వేలు దిగి వచ్చింది. గత వారంలో పసిడి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. కానీ ఈ వారంలో ఈ మూడ్రోజుల్లో దాదాపు రూ.2000 వరకు క్షీణించింది.

రూ.50,000కు దిగివచ్చిన బంగారం ధరలు: అక్కడ తగ్గి, అంతలోనే పెరిగి...రూ.50,000కు దిగివచ్చిన బంగారం ధరలు: అక్కడ తగ్గి, అంతలోనే పెరిగి...

ఈ రోజు మరింత తగ్గిన ధర.. 4 రోజుల్లో రూ.2500 డౌన్

ఈ రోజు మరింత తగ్గిన ధర.. 4 రోజుల్లో రూ.2500 డౌన్

ఈ రోజు ఎంసీఎక్స్‌లో ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.45 శాతం క్షీణించి రూ.49,293 పలికింది. వెండి కిలో 3 శాతానికి పైగా నష్టపోయి రూ.56,710కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే రూ.2500కు పైగా పడిపోయింది. ఈ నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.2500కు పైనా క్షీణించింది. నిన్నటి సెషన్‌‌లో రూ.1000 వరకు తగ్గింది. వెండి నిన్న రూ.2700 వరకు తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టంతో వెండి రూ.20వేలు తగ్గినట్లే.

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు

అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగి వస్తుండటంతో బులియన్ మార్కెట్లో పుత్తడి ధర క్షీణిస్తోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.750కి పైగా తగ్గి రూ.52,470 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.700 తగ్గి రూ.48,100 పలికింది. ఢిల్లీలో రూ.500కు పైగా తగ్గిన 24 క్యారెట్ల పసిడి రూ.53,460,22 క్యారెట్ల పసిడి రూ.49,000 పలికింది.

జూలై 22వ తేదీ తర్వాత కనిష్టం

జూలై 22వ తేదీ తర్వాత కనిష్టం

ఇటీవల డాలర్ బలపడుతోంది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో అమెరికా డాలర్ రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లు రూటు మార్చారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, యూరోపియన్ దేశాల్లో లాక్ డౌన్ ఆలోచనలు ఉన్నప్పటికీ డాలర్ వ్యాల్యూ పెరగడం బంగారంపై ఒత్తిడి తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనమైంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,858.08 డాలర్లకు క్షీణించింది. ఓ సమయంలో 1,853.32 డాలర్లకు పడిపోయింది. జూలై 22వ తేదీ తర్వాత ఇది కనిష్టం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,862.30 డాలర్లు పలికింది. వెండి 3.3 శాతం క్షీణించి ఔన్స్ 23.62 డాలర్లు పలికింది. ఓ సమయంలో రెండు నెలల కనిష్టం 23.04 డాలర్లు కూడా పలికింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.87 శాతం తగ్గి 1,267.14 టన్నులకు చేరుకుంది. ప్లాటినమ్ ఔన్స్ 838.32 డాలర్లకు, పల్లాడియం 2,217.90 డాలర్లకు చేరుకుంది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధర, ఈవారం రూ.2,500 డౌన్: ఆల్‌టైం హైతో వెండి రూ.20,000 తగ్గింది | Gold falls to over two month low, down Rs 6,000 from record highs

Gold and silver prices in India continued their fall today, extending losses to the fourth day. On MCX, October gold futures were down 0.45% to ₹49,293 per 10 gram while silver futures lost 3% to ₹56,710 per kg. In four days, gold has lost about ₹2,500 per 10 gram so far. In the previous session, gold had slumped 1.9% or ₹950 while silver had crashed 4.5% or ₹2,700 per kg.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X