For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద, బంగారం ధర తగ్గడంతో...

|

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు జోరుగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలోను వరుసగా ఐదో నెల ఆగస్ట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో రూ.908 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా మహమ్మారి భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సహా అందరూ సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. దానికి తగినట్లుగానే పసిడి ధరలు గత ఆరు నెలల కాలంలో దాదాపు రూ.15వేల వరకు పెరిగింది. భౌతిక బంగారం కొనుగోలు తగ్గినప్పటికీ, బంగారంపై పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది.

రీస్కిల్-రీస్టార్ట్, 500 మంది ఉద్యోగుల్ని తీసుకోనున్న ఇన్ఫోసిస్రీస్కిల్-రీస్టార్ట్, 500 మంది ఉద్యోగుల్ని తీసుకోనున్న ఇన్ఫోసిస్

రూ.5,356 కోట్ల పెట్టుబడులు

రూ.5,356 కోట్ల పెట్టుబడులు

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ మాసం వరకు గోల్డ్ ఈటీఎప్‌లలోకి రూ.5,356 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించింది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. బంగారం ధరలు రికార్డ్ స్థాయికి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు తమ నిధుల్ని ఈక్విటీ మార్కెట్ నుండి బంగారం వంటి అతివిలవైన లోహాల వైపు మళ్లించినట్లు తెలిపింది. అయితే రష్యా వ్యాక్సీన్ వచ్చిన అనంతరం నుండి పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో రూ.51వేల సమీపానికి చేరుకుంది. గత నెలలో ఆగస్ట్ 7న గరిష్టంగా రూ.56,200 పైన పలికింది.

జూలైతో పోలిస్తే తక్కువ

జూలైతో పోలిస్తే తక్కువ

ఆగస్ట్ నెలలో గ్లోడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లోకి రూ.908 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు పసిడిని తమ పోర్ట్‌పోలియోల్లోకి చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జూలై నెలలో రూ.921 కోట్లు వచ్చాయి. దీంతో పోలిస్తే మాత్రం తక్కువ కావడం గమనార్హం. అయితే నెల రోజులుగా ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో కాస్త తగ్గింది.

నెలవారీగా చూస్తే...

నెలవారీగా చూస్తే...

గోల్డ్ ఈటీఎఫ్ నిర్వహణలోని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్(AUM) రూ.12,941 కోట్ల(జూలై) నుండి 4 శాతానికి పైగా పెరిగి రూ.13,503 కోట్లకు (ఆగస్ట్) చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి మాసంలో రూ.202 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1483 కోట్లు వచ్చాయి. మార్చిలో రూ.195 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మే నెలలో రూ.815 కోట్లు, జూన్ నెలలో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్ట్ నెలలో రూ.908 కోట్లు వచ్చాయి.

English summary

ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద, బంగారం ధర తగ్గడంతో... | Gold ETFs log inflows for 5th straight month amid Coronavirus

Gold ETFs witnessed an inflow of Rs 908 crore in August, for fifth month in a row, amid major economies staring at recession due to the spread of coronavirus pandemic. With this, net inflow in gold exchange traded fund or ETF category reached at Rs 5,356 crore in January-August period of 2020, data with the Association of Mutual Funds in India (Amfi) showed.
Story first published: Saturday, September 12, 2020, 18:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X