బంగారం ధరలు పెరిగాయి, కానీ రూ.47,000 దిగువనే: ఇటీవల వరస్ట్ వీక్
ముంబై: నిర్మలమ్మ బడ్జెట్ అనంతరం బంగారం ధరలు అంతకంతకూ పతనమవుతున్నాయి. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 తాకిన పసిడి, ఆ తర్వాత వ్యాక్సీన్ ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. కొద్ది నెలలపాటు రూ.51వేల నుండి రూ.53వేల మధ్య కదలాడాయి. వ్యాక్సినేషన్, కరోనా కేసులు తగ్గడంతో రూ.50,000 వద్ద చాలా కాలం కొనసాగాయి. బడ్జెట్ అనంతరం పసిడి ధరలు మరింతగా పతనమై రూ.46,000 స్థాయికి వచ్చాయి. నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,067 తగ్గి రూ.46,749 వద్ద క్లోజ్ అయింది. జూన్ ప్యూచర్స్ రూ.46,817 వద్ద ముగిసింది. వెండి ఫ్యూచర్స్ రూ.1500 వరకు తగ్గి రూ.67,085 వద్ద క్లోజ్ అయింది. అయితే నేడు (ఫిబ్రవరి 5, శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రారంభ సెషన్లో రూ.47,000 దిగువనే ఉన్నాయి. రెండు నెలల కాలంలో పసిడికి ఇది వరస్ట్ వీక్‌గా కనిపిస్తోంది.

47,000 దిగువనే పసిడి
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 5వ తేదీ) ఉదయం 161.00 (0.34%) పెరిగి రూ.46,876.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,886.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,831.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300కు పైగా తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. రూ.140.00(0.30 శాతం) పెరిగి రూ.46,982 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,982.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,982.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,982.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.450 పెరుగుదల
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 448.00 (0.67%) పెరిగి రూ.67266.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,210.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,331.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,205.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.354.00 (0.52%) పెరిగి రూ.68,355.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,355.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గి, 1800 డాలర్ల దిగువకు వచ్చింది. అయితే నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.95
(0.22%) డాలర్లు తగ్గి 1795.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,792.25 - 1,797.65 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.15% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.118
(+0.45%) డాలర్లు తగ్గి 26.352 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.258 - 26.457 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.234 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications