రూ.50,000 దిశగా బంగారం ధరలు, రూ.63,500 పైకి వెండి
ముంబై: బంగారం ధరలు శుక్రవారం (డిసెంబర్ 11) స్వల్పంగా పెరిగాయి. గతవారం ధరలు పెరిగాయి. అంతకుముందు వరుసగా మూడు వారాలు క్షీణించి రూ.48వేల దిగువకు వచ్చాయి. ఇప్పుడు రూ.49వేల పైకి చేరుకొని, రూ.49,500 దిశగా కదులుతోంది. ఇటీవల ఫైజర్ కరోనా వ్యాక్సీన్‌కు అనుమతుల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి క్షీణిస్తున్నాయి. వ్యాక్సీన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. దీంతో ధరలపై ప్రభావం పడుతోంది.

పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.259.00 (0.53%) పెరిగి రూ.49336.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,150.00 వద్ద ప్రారంభమై, రూ.49,438.00 గరిష్టాన్ని, రూ.48,875.00 కనిష్టాన్ని తాకింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6800 తక్కువగా ఉంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.239.00 (0.49%) పెరిగి రూ.49392.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,253.00 ప్రారంభమై, రూ.49,505.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,955.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు అప్
సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.70.00 (0.11%) పెరిగి రూ.63600.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,459.00 ప్రారంభమైన ధర, రూ.63,935.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,700.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ కిలో రూ.31.00 (0.05%) పెరిగి రూ.64,267.00 వద్ద ప్రారంభమై, రూ.64,801.00 గరిష్టాన్ని, రూ.63,635.00 కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్లకు సమీపంలో బంగారం
అంతర్జాతీయమార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల సమీపానికి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ 8.75 (+0.48%) డాలర్లు పెరిగి 8.75 (+0.48%) డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,827.25-1,851.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి 22.81% డాలర్లు పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.034 (+0.14%) డాలర్లు పెరిగి 24.128 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.703 - 24.242 మధ్య కదలాడింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 41.92% పెరిగింది.


Click it and Unblock the Notifications