ముంబై: బంగారం ధరలు ఇటీవల భారీగా క్షీణించాయి. ఏకంగా పది నెలల కనిష్టానికి పడిపోయాయి. ఆగస్ట్ 7నాటి ఆల్‌టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఇప్పటి వరకు ఇరవై శాతానికి పైగా తగ్గాయి. బంగారం ధరలు తగ్గడంతో రిటైల్ బులియన్ మార్కెట్లో కొనుగోళ్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా తగ్గడంతో ఇటీవలి కాలంలో దిగుమతులు కూడా పెరిగాయి. ప్రస్తుతం పసిడి ధరలు భారీగా క్షీణించినందున లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టవచ్చునని సూచిస్తున్నారు.

రూ.45వేల పైకి చేరినా...
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న రాత్రి స్థిరంగా ముగిశాయి. ప్రారంభంలో కాస్త పెరిగినప్పటికీ, అది అది స్వల్పమే. రూ.45వేల దిగువనే క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.45వేల మార్కును దాటినా ఆ తర్వాత క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.27.00 (0.06%) పెరిగి రూ.44840.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,890.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,037.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,756.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.39.00 (-0.09%) పెరిగి రూ.45230.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,273.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,392.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,117.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.67000 క్రాస్
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో రూ.67,000 మార్కును దాటాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.331.00 (0.49%) పెరిగి రూ.67250.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,930.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,401.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,802.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.188.00 (0.28%) పెరిగి రూ.68232.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,194.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,385.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,940.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్ల పైకి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం సెషన్లో ప్రారంభంలో స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. నేడు మళ్లీ పెరిగాయి. నిన్న 1730 డాలర్ల దిగువకు వచ్చాయి. నిన్నటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.55 (+0.26%) డాలర్లు తగ్గి 1,726.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,722.95 - 1,736.65 డాలర్ల మధ్య కదలాడింది. కానీ నేటి సెషన్లో భారీగా జంప్ చేశాయి. ఏకంగా 1750 డాలర్ల పైకి చేరుకుంది. 23.50 (+1.36%) డాలర్లు ఎగిసి 1750.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైకి చేరుకుంది. ఔన్స్ ధర 0.544 (+2.09%) డాలర్లు తగ్గి 26.602 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.398 - 26.672 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications